సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
బృహత్తర చండీయాగ ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన్ పరిషత్, దేవాలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో 13వ స్వాముల సద్ధి కార్యక్రమంలో భాగంగా మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం బృహత్తర చండీయాగ కార్యక్రమం ప్రారంభమైంది. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 13మంది వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, శివలింగానికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నవగ్రహాలకు, గణపతి స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. శ్రీలక్ష్మీగణపతి, రుద్ర, చండీ హోమాలు ప్రారంభమయ్యాయి. చండీ, లలితా సహస్రనామ సామూహిక పారాయణాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చండీయాగం జనవరి 13 వరకు నిత్యం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.