ఆదర్శ మహిళ అహల్యాబాయి పోరాటయోధురాలు అహల్యాబాయి జీవితాన్ని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ మంగళవారం రాత్రి నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య , ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ రాధాబాయి మాట్లాడుతూ. దేశం , సమాజ చైతన్యం కోసం నిస్వార్ధ పోరాటం చేసిన అహల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అనంతరం డాక్టర్ వెలువోలు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వాల్మీకి రామాయణం సుందరకాండలోని త్రిజట స్వప్నం విశిష్టతను వివరించారు. ఈసందర్భంగా ఇటీవల కళారత్న పురస్కారం స్వీకరించిన దేవాలయ పాలకవర్గం అధ్యక్షుడు సీహెచ్ . మస్తానయ్యను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి , సభ్యులు డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి , చందు హనుమా...
అలరించిన సంగీత విభావరి – 15.12.2024
బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి
ఆలయప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళాంజలి,
గుంటూరు
వారిచే నిర్వహించిన సుమధుర సంగీత విభావరి కార్యక్రమం ఆల రించింది. గాయనీగాయకులు
సత్యవర్ధన్, సుధీర్, సాంబశివరావు, రమేష్, గాయత్రి గాత్ర ధారణలో అలనాటి సినీ భక్తి గీతాలను శ్రావ్యంగా
ఆలపించారు. కీబోర్డుపై రవిబాబు. తబలపై వెంకట్, ప్యాడ్సైపై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి