సనాతన ధర్మం – జీవనమార్గం సనాతన ధర్మం మతం కాదని జీవన విధానమని సంస్కృత భారతి సభ్యులు, భౌతికశాస్త్ర అధ్యాపకులు ఉపద్రష్ట లక్ష్మణసూరి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శుక్రవారం సనాతన ధర్మం – జీవన మార్గంపై ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. తొలుత ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపద్రష్ట లక్ష్మణ సూరి ఉపన్యాసిస్తూ ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన సంప్రదాయమన్నారు. విశ్వప్రేమను భూమి అంత విస్తరింపచేసేది సనాతన ధర్మమన్నారు. ప్రశ్నించడం నేర్పిన సంస్కృతి మనదని, మనలో ఉన్న పరమాత్ముని చేరడానికీ భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల ద్వారా మన సనాతన ధర్మం ఎన్నో సాంప్రదాయలను తరతరాలుగా అందించిదన్నారు. విజ్ఞానమయ భాండాగారమైన వేదాలు మనదేశానికి ఆస్తి అక్షర సంపదన్నారు. శాస్త్రవేత్త ప్రయోగశాలలో పరిశోధించే యంత్రమైన, దేవాలయంలో పురోహితుడు చదివే మంత్రమైన ఇద్దరి తంత్రం ఒకటేనన్నారు.
పెరవలి సిస్టర్స్ – శాస్త్రీయ సంగీత కచేరి – 21.12.2024
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల వారి నెలనెల కార్యక్రమంలో భాగంగా పెరవలి సిస్టర్స్‌చే శాస్త్రీయ సంగీత కచేరి జరిగింది. వీరికి మృదంగం బి. సురేష్, వయోలిన్ నందకుమార్, ఘటం హరిబాబు చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి