త్రిశూలం నాటికల సంపుటి ఆవిష్కరణ - 05.12.2024
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ
ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కళావిపంచి,
ఆరాధన
ఆర్ట్స్ అకాడమీ, నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్
సౌజన్యంతో ఉషోదయ కళానికేతన్ 18వ వార్షిక వేడుకలు
జరుగుతున్నాయి. గురువారం రాత్రి చెరుకూరి సాంబశివరావు రచించిన త్రిశూలం నాటికల
సంపుటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు
ఆవిష్క రించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నాటక ప్రయోక్త కందిమళ్ల సాంబశివరావు
అధ్యక్షత వహించారు. రంగస్థల, సినీ నటుడు డాక్టర్
ముత్తవరపు సురేష్బాబు, కేసీపీ ఇండియా లిమిటెడ్
ఉపాధ్యక్షుడు వజ్జా మధుసూదనరావు, రంగస్థల ప్రము ఖులు
జరుగుల రామారావు, కావూరి సత్య నారాయణ, ఆలయ పాలకమండలి అధ్య క్షుడు సీహెచ్ మస్తానయ్య, నటుడు మానా పురం సత్యనారాయణ, బ్రేక్ ఇన్స్పెక్టర్ బి. మధుసూదనరావు,
కళావిపంచి
అధ్యక్షుడు బొప్పన నరసింహారావు తదితరులు పాల్గొ న్నారు. తొలి ప్రతిని డాక్టర్
ముత్తవరపు సురేష్ బాబుకు చెరుకూరి సాంబశివరావు అందించారు. అనంతరం ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి నిర్వహణలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వంలో కిడ్నాప్ నాటిక ప్రదర్శితమైంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి