భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి చిన్మయా మిషన్ సువీరానందస్వామి భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం గురించి ప్రసంగించారు. తొలుత ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కె.పూర్ణచంద్రరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కాటాబత్తుల పూర్ణచంద్రరావు రాధ పాల్గొన్నారు.
అలరించిన భక్తిగీతాల లహరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం బెల్లంకొండ ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా జరిగిన భక్తిగాన లహరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాయనీమణులు చింతలపాటి రమాగోపాలకృష్ణ, అంజనీదేవి, నాగలక్ష్మి, పావని లు తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలను శ్రావంగా ఆలపించారు. వయోలిన్‌పై చావలి శ్రీనివాస్, మృదంగంపై జగన్మోహిని చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి