అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
స్వచ్ఛంద సేవలు అభినందనీయం భారతీయత-స్వచ్ఛంద సేవాత్సరాల సేవా ప్రస్థానం సంస్థ 25 సంవ ఆదర్శనీయమని ఇస్కాన్ టెంపుల్స్ అంతర్జాతీయ ప్రచారకుడు రామ్ మురారిదాస్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద భారతీయ స్వచ్చంద సేవా సంస్థ రజతోత్సవం, అమరావతి సాంసృతిక చైతన్య వేదిక ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రంశెట్టి శివసూర్యనారాయణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తదితరులు ప్రసంగించారు. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రాలు, యోగా తరగతులు, రైతు ప్రాధాన్య సదస్సులు, న్యాయ సంబంధ చట్టాలపై అవగా హన కార్యక్రమాలు, పేదలకు నిత్యా వసరాలు వైద్య సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధి చిగురుపాటి రవీంద్రబాబు చెప్పారు. గాయకులు లెనీన, పాటల వెంకన్న, రంగం రాజేష్, ఎం అరుణ్ కుమార్, పి అశోక్, బిల్లా నాగరాజులకు నిర్వా హకులు, అతిధులు ఉగాది కళాపురస్కారాలిచ్చి సత్కరించారు. కార్యక్ర మంలో డాక్టర్ విజయలక్ష్మి, పీ...