ఆకట్టుకున్న ఇంద్రజాల ప్రదర్శన
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణ వేదికపై ఏ.పి. మెజీషియన్స్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన విశిష్ట ఇంద్రజాల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్.యల్. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మెజీషియన్స్ డాక్టర్ ఆర్నల్, జె.వి.ఆర్., అద్దంకి నాగరాజు, డాక్టర్ పి.వి. రామ్‌కుమార్, నాగేంద్ర గార్లు చేసిన ఇంద్రజాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో పెద్దలు, పిల్లలు హాజరై ఇంద్రజాల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న మెజీషియన్స్‌ను ఆర్.యల్. ప్రసాద్ ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి