మంగళాశాసనం పాశురం, వామనావతార వైభవ విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై ధనుర్మాస మహో త్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం మంగళాశాసనం పాశురం, వామనావతార వైభవ విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శ ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రసంగిస్తూ ‘మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!’ అని అండాళ్ తల్లి స్వామి ఆయా అవతారాల్లో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడిందని అన్నారు. వ్యాస భాగవతంలోని ఘట్టం మూలమైనా తెలుగు వారిలో పోతన శ్రీమదాంధ్ర భాగవతంలోని వామన చరిత్రమే సుప్రసిద్ధమని భగవత్ భక్తులకు సవివరంగా తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి