నాటకరంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – 04.12.2024
నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ చెప్పారు. ఉషోదయ కళానికేతన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఉషోదయ కళానికేతన్ సంస్థలో నటించిన నటీనటులను ఆయన సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటకాల అభివృద్ధికి ఉషోదయ కళానికేతన్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన కళలను అంతరించిపోకుండా కాపాడుకున్న సంస్థలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో కూడా నాటక రంగం ద్వారా అనేకమంది సేద తీరుతున్నారన డంలో అతిశయోక్తి లేదదన్నారు. అనంతరం సంస్థ వారు మన్నవ మోహనకృష్ణను సన్మానించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి