అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
మూత్ర సమస్యలపై అవగాహన అవసరం మూత్ర సంబంధిత సమస్యలపై వయోవృద్ధులు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ ఆరె అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగ ణంలోని అన్నమయ్య కళావేదికపై గుంటూరు జిల్లా సీని యర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూత్ర సమస్య లపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కార్తీక్ ఆరె, డాక్టర్ చేకూరి సింధుశ్రీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూత్ర సమస్యలపై అవగాహన కల్పించారు.