అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని, కళావిపంచి సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వ హించారు. అనంతరం జె. రాధాకృష్ణకు కళావిపంచి జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు కళావిపంచి సాహిత్య పురస్కారం, జమలాపురం రాధాకృష్ణ జి.వి.జి.శంకర్, జి.మల్లికార్జునరావులకు బొప్పన ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్ (కాట్రపాడు) ప్రదర్శించిన గారడి నాటిక అలరించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికా ర్జునరావు, బి.జె.పి.అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, డాక్టర్ రవి కొండబోలు, కె.సి.పి. సిమెంట్ వైస్ చైర్మన్ మధుసూదనరావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనా రాయణ, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు. నాటక కళాకారులకు బొప్పన నరసింహారావు ఒక వరమని కళ పత్రిక సంపాదకుడు మ...