రైతుల జీవిత దర్పణం.. పడమటి గాలి – 10.12.2024
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై పండు క్రియేషన్స్, కొప్పోలు (ఒంగోలు) వారి నాటకోత్స వాల్లో భాగంగా మంగళవారం రాత్రి ప్రదర్శించిన పడమటి గాలి సంక్షిప్త నాటకం సందేశాత్మకంగా సాగింది. భార్యాభర్తల అనుబందాన్నీ, కన్నవాళ్లకూ బిడ్డలకూ మధ్య మమకారాన్ని ధ్వంసం చేస్తున్న ఆర్థిక సంబంధాలు, రైతుకూలీని రైతుకు దూరం చేస్తున్న విషాదాలు, రైతుకు ప్రాణాధారమైన భూమిని తనకి కాకుండా చేయాలన్న బడాబాబుల కుట్రలు, అనైతిక శారీరక సంబం ధాలు, కట్నాల కోసం వెంపర్లాటలు, అమెరికా వ్యామోహాలను నాటకం ప్రతిబింబించింది. డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు రచనకు, గుమ్మళ్ల బల రామయ్య దర్శకత్వం వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్ర సాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని పడమటి గాలి నాటకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో కందిమళ్ల సాంబశివరావు, సత్యనారాయణ, దేవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉన్నం వెంకట శేషయ్య నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి