గాంధీ మహాత్ముని ఆస్థాన కవి తుమ్మల – అప్పాజోస్యుల సత్యనారాయణ – 13.12.2024
గాంధీ మహాత్ముని ఆస్థానకవి తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి రుషి వంటి కవి అని ఆచార్య అప్పోజోస్యుల సత్యనారాయణ అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు తుమ్మల సాహిత్య పురస్కార ప్రదానం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తుమ్మల సాహిత్య విశేషాలను విశ్లేషించి చెప్పారు. తుమ్మల సీతారామమూర్తి గురించి కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ప్రముఖులు ఎంతో గొప్పగా పేర్కొన్నారన్నారు. ఆటవెలది, తేటగీతి, కందం లాంటివే కాక అన్ని ఛందస్సులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ఎంతో గొప్పగా ఆయన కవిత్వం కనిపి స్తుందన్నారు. ఆయన రాసిన రైతుకవి త్వంలో తెలుగు రైతన్నల జీవన సరళి స్పష్టంగా చూడొచ్చన్నారు. గాంధీజీ ఆస్థానకవిగా ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరమని, చాలామంది కవులలాగా తాత్కాలిక ప్రయోజనాల దృష్టితో కాక కాలాతీత కవిత్వ రచన చెయ్యబట్టే 124 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతిని చేసుకుంటూ స్మరించుకొంటున్నాము న్నారు. వేదికపై ఆచార్య అప్పాజోస్యుల సాంస్కృ తిక సేవలకు గుర్తింపుగా తుమ్మల కళాపీఠం పురస్కారాన్ని అందిస్తున్నట్లు సభాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ చెప్పారు. రూ. 20 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభలో రచయితలు డాక్టర్ సూర్యదేవర రవికుమార్, పెద్ది సాంబశివరావు, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి ప్రసంగించారు. నగర ప్రముఖులు నూతలపాటి తిరుపతయ్య, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నాగసుశీల, డాక్టర్ వి. సింగారావు, ఏలూరి సూర్యనారాయణ, పారా అశోక్‌కుమార్, నాగేంద్రం పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి