రామ నామ సంకీర్తనం.. భక్తి పారవశ్యం – 14.12.2024
భజరే గోపాలం నామ సంకీర్తనం భక్తులను భక్తి
పారవశ్యంతో పరవశింపజేసింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బి.ఆర్. గార్డెన్స్‌లోని
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై శనివారం లింగం
చంద్రశేఖర్, గుళ్లపల్లి సుబ్బారావు సేవా
సంస్థ సౌజన్యంతో భజరే గోపాలం నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకు చెందిన నాదోపాసకులు
శ్రీరామపాద భాగవతార్, రమాశ్రీరామ్, గోకుల్ కృష్ణ, విక్రమ్, హరిరహర న్లు గాత్రధారణలో వాగ్గేయకారుల సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు.
ఆదిశంకర, భగవత్పాద, అన్నమాచార్య. రామదాసు కీర్తనలను శ్రీరామపాద భాగవతార్
స్వరబద్ధంగా రామనామంతో ప్రారంభించి.. హనుమంతుని స్తుతితో మంగళం పాడారు. శ్రీరామపాదకు
రమా శ్రీరామ్ గాత్ర సహకారం అందించగా హార్మోనియంపై మృదంగంపై గోపాల్, డోలక్‌పై సాకేత్‌రామ్ వాయిద్య సహకారం అందించారు. శ్రీరామ
పాద భాగవతార్ మాట్లాడుతూ పవిత్రమైన రామనామ సంకీ ర్తన ఈ వేదికపై కచేరి చేయడం తనకు
లభించిన భాగ్యమన్నారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవ స్థాపక కార్యదర్శి
బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలక కమిటీ
అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య, కార్యదర్శి బొర్రా
ఉమామహేశ్వరరావు, సహాయకార్య దర్శి ఊటుకూరి
నాగేశ్వరరావు, నిర్వాహకులు నామ సంకీర్తన
కళాకారులను ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి