ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

అలరించిన తాళం భజన - శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు - 10.10.2026

అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ   పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.

అలరించిన భక్తిగీతాలాపన - 31.07.2026

అలరించిన భక్తిగీతాలాపన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం శ్రీ వాగ్దేవి బృందగాన సమితి, గుంటూరు వారిచే భక్తిగీతాలాపన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీమణులు ఎస్. గీత, ఎం. భాగ్యలక్ష్మి, ఉషారాణి, శ్యామల, మాధవి, శోభ, విజయలక్ష్మి లు తమ గాత్రధారణలో గోపాలకృష్ణ పాహీ, పద్మావతి రమణి పాహీ,  నారాయణ సకుల బ్రహ్మణే అంటూ పలు భక్తిగీతాలను ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. మృదంగంపై కిషోర్, వయోలిన్ పై సిహెచ్. శ్రీనివాస్ వాయిద్య సహాకారం అందించారు.

బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం : వాసిరెడ్డి విద్యాసాగర్ - 30.07.2026

బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం : వాసిరెడ్డి విద్యాసాగర్ దివంగత కుమార్తె సాహితీ రెడ్డి గత 8 సంవత్సరాలుగా విద్య సామాజిక సేవలకు భూరి విరాళాలు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఉన్న బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశోక్ రెడ్డి సుధావాణి దంపతుల సామాజిక సేవలు సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని విబిఐటి విశ్వవిద్యాలయం ఛాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పేర్కొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పద్మావతి కళ్యాణ మండపంపై బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రధానోత్సవ సభ నిర్వహించారు. సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏకైక కుమార్తె జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఇతర సామాజిక కార్యక్రమాలకు రూ.8 కోట్లకు పైగా సేవా కార్యక్రమాలకు అందించటం మిత్రుడిగా గర్విస్తున్నానన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం సాహితీ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాహితి సుగంధం ఆవిష్కరణ ఆవిష్కరించారు. బండి సాహితీ రెడ్డి వరిష్ట పురస్కారాన్ని ప్రముఖ సినీ, ...

వైభవంగా సహస్ర కలశాభిషేకం - 30.07.2026

వైభవంగా సహస్ర కలశాభిషేకం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీకంచికామకోటి పీఠ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం చాతుర్మాసం, స్వామి వారి తిరున క్షత్రం సందర్భంగా పంచామృతాభిషేకం, సహస్ర కలశాభిషేకం ఆలయ ప్రధాన పూజారి మాధవాచార్యుల బృందం వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో జరగ్గా, సుమారు 500 కల శాలకు విశేష పూజలు చేపట్టారు. అభిషేక పూజలో భక్తులు పాల్గొనగా, మేళతాళాలతో ప్రదక్షిణలు చేసి ఆలయంలోకి ప్రవేశించారు. విశేష హారతి అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు, అభిషేకాల్లో పాల్గొన్న వారికి కలశం ప్రత్యేక ప్రసాద వితరణ చేశారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు,ఉపాధ్యక్షుడు విజయబాబు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ - 29.07.2026

  భక్తిశ్రద్ధలతో చండీహోమం   స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 1 1మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి , శివలింగానికి , నవగ్రహాలకు విశేష అభిషేకాలు , అర్చనలు , లక్ష్మీగణపతి , చండీ , రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ - 29.07.2026

విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై అన్నమయ్య సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి నుంచి పీజీ చదివే పేద విద్యార్ధినీ , విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. సుమారు నలభై రెండు మంది విద్యార్ధినీ , విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సుందరకాండ సుందరమైనది - బాషాప్రవీణ నిష్ఠల సుబ్రహ్మణ్యశాస్త్రి - 28.07.2026

సుందరకాండ సుందరమైనది స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం సుందరకాండ సుందరమైనది ఎందుకు? అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాషాప్రవీణ నిష్ఠల సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రవచిస్తూ రామాయణంలో సుందరకాండ అత్యంత శుభప్రదమైనది, ఆశాజనకమైనదన్నారు. సుందర అంటే కేవలం అందమే కాక మంగళం , విజయం అని కూడా అర్థమన్నారు. నిరాశలో ఉన్న రాముడికి హనుమంతుడు సీతాదేవి ఆచూకీని కనుగొని చూశాను సీతను అనే దివ్యమైన వార్తను అందించడం ఈ కాండలోని ప్రధాన ఘట్టమన్నారు. హనుమంతుని అద్భుత పరాక్రమం , నిశ్చలమైన రామానుగ్రహ భక్తి , మనోహరమైన కావ్య వర్ణనలు మరియు చదివేవారికి ధైర్యాన్ని , ఆనందాన్ని ప్రసాదించే శుభ పరిణామాలు నిండి ఉండటం వల్లే ఇది నిజంగా సుందరమైనదిగా నిలిచిందన్నారు.

కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు - 27.07.2026

కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం కిమ్స్ శిఖర హాస్పటల్, గుంటూరు మరియు గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రసంగిస్తూ కిడ్నీలు శరీరంలో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే మధుమేహం , అధిక రక్తపోటు , పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడటం వంటి కారణాల వల్ల ఇవి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కాళ్ల వాపులు , మూత్రంలో మార్పులు, అలసట వంటి ప్రారంభ లక్షణాలను పసిగట్టడం చాలా ముఖ్యమన్నారు. సరిపడా నీరు తాగడం , ఉప్పు తగ్గించడం , క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను వివరిస్తూనే , ఉచిత బి.పి. , షుగర్, క్రియాటినిన్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు   ప్రజలకు ఉన్న అపోహ...

అలరించిన భక్తి సంగీత విభావరి - 26.07.2026

అలరించిన భక్తి సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం మహతీ స్వరసుధ భక్తి సంగీత విభావరి నిర్వ హించారు. మహతీ స్వరసుధ వ్యవస్థాపక అధ్యక్షురాలు పత్రి నిర్మల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని బండ్లమూడి విజయలక్ష్మి, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. గాయనీ, గాయకులు రాజ్యలక్ష్మి, జరీనా, చాందిని, మదురిత, ప్రహర్షితా, ప్రసన్నలక్ష్మి, చిరంజీవి తదితరులు సినీ భక్తి గీతాలను అలపించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యతగా వ్యవహరించగా, మదన్మోహన్రావు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం - 25.07.2026

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదిక మీద గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి, జానపద నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామ హేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సమన్వయకర్త గుళ్లపల్లి రాఘవరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు నాట్యాచార్య షేక్. ఖలీల్ శిష్యబృందాన్ని సత్కరించారు.