తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం
బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి
దేవాలయంలో తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా
తిరుప్పావై ఆధ్యాత్మిక ప్రవచనాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ పాలక
మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి
ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం గోదా
అమ్మవారి మూలవిరాట్‌కు వివిధ పల రసాలు, పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణ జరిగాయి.
డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకి తిరుప్పావై ప్రవచనం చేస్తూ కార్తిక మాసం లాంటిదే
ధనుర్మాసమన్నారు. కాత్యాయిని వ్రతం విశిష్టత,
గోదాదేవి
అమ్మవారి ఆవిర్భా వాన్ని తొలి పాశురంలోని విశేషాలు వివరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి