జానకికి రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు ప్రదానం – 07.12.2024
స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి
దేవాలయం అన్నమయ్య కళావేదికపై శని వారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యం లో
రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ నిర్వహించారు. సన్మండలి
అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పి.విజయ, ఎంవై. శేషురాణి అధ్య క్షత వహించారు. ఆలయ పాలకమండలి
అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా
విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం విశ్రాంత ఆచార్యులు పాటిబండ్ల
జానకికి రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. డాక్టర్
అన్నవరపు రామస్వామి తన చేతికున్న సువర్ణ ఘంటా కంకణాన్ని శిష్యురాలు పాటిబండ్ల జానకికి
బహూకరించి, ఆశీర్వదించారు. సభానంతరం విదుషి
కార్తీక అనఘ(లం డన్) శాస్త్రీయ సంగీత కచేరి అలరించింది. వయోలి న్పై బీవీ
దుర్గాభవాని(విజయవాడ), మృదంగంపై విద్వాన్ బి.సురేష్ బాబు చక్కటి వాయిద్యాన్ని అందిం
చారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, ఉపాధ్యక్షులు డాక్టర్
రాజరాజేశ్వరి, పి. లలితాదేవి, కార్యదర్శి
ఎ. మంగాదేవి పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి