అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి స్థానిక బృందావన్గార్డెవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ పాకిస్థాన్ యుద్ధంలో భారత దేశమే పైచేయి కావాలని అన్నారు. కోవిడ్-19 బారిన పడకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. భాగవత గోష్ఠితో మూడుసార్లు ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారని అన్నారు. అనంతరం శృం గార నైషధంలోని ఇతివృత్తాన్ని వివరించారు.