అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ కే.ఆర్.కే.ఎం. మెమోరియల్ అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 15.09.2024 ఆదివారం అమరావతి నాట్యోత్సవాలలో భాగంగా నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి శిష్య బృందం పలుకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని , ప్రముఖ నాట్యచారి సత్యనారాయణరాజు రామ కథ లోని ప్రధాన ఘట్టాలను భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.