వైభవంగా పసుమర్తి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవం
శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రముఖ చలనచిత్ర నృత్య దర్శకుడు, కూచిపూడి సంప్రదాయ కుటుం బానికి చెందిన పసుమర్తి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవం బృందావన గార్డెన్స్ వెంకటే శ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేది కపై వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్య క్షుడు చిట్టిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నాట్యచార్యుడు భాగవతుల వెంకటరామశర్మకు పసుమర్తి కృష్ణమూర్తి స్మారక విశిష్ట పురస్కారాన్ని సంస్థ నిర్వాహకులు అందించారు. పసుమర్తి కృష్ణమూర్తి తనయుడు పసుమర్తి ఉదయ్ భాస్కర్, ఊటుకూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం పసుమర్తి కృష్ణమూర్తి నృత్య దర్శకత్వం వహించిన 16 గీతాల నృత్యాలను యధాతథంగా ప్రదర్శించారు. నాట్యాచార్య డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం పసుమర్తి నృత్యబాణిని విశ్లేషించారు. కార్యక్రమాన్ని వెంకటగిరి నాగలక్ష్మి, నాగమోహిని పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి