ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అలరించిన తాళం భజన - శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు - 10.10.2026

అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ   పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ఇటీవలి పోస్ట్‌లు

కఠోపనిషత్ పై ప్రవచనము - సువీరానందస్వామి, చిన్మయమిషన్ - 05-09.10.2026

కఠోపనిషత్ పై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కఠోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ కఠోపనిషత్తు రెండవ అధ్యాయం , తృతీయ వల్లీలో పరమాత్మ ఉన్నాడు అనే నిశ్చయాత్మక విశ్వాసంతో సాధన ప్రారంభించినప్పుడే ఆ పరబ్రహ్మ నిజస్వరూపం అనుభవంలోకి వస్తుందని యముడు తెలుపుతాడన్నారు. ఆ తర్వాత , హృదయంలోని సమస్త కోరికలు మరియు అజ్ఞాన బంధాలు జీవించి ఉన్నప్పుడే తొలగిపోతే , మరణించే స్వభావం ఉన్న మానవుడు ఇక్కడే అమరత్వాన్ని సాధించి బ్రహ్మత్వాన్ని పొందుతాడని స్పష్టం చేస్తాడన్నారు. హృదయానికి ఉండే 101 నాడులలో శిరస్సు వైపు వెళ్లే సుషుమ్నా నాడి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ , మరణ సమయంలో ఈ నాడి ద్వారా పయనించినవాడు అమరత్వాన్ని పొందుతాడన్నారు.

ముగిసిన వాగ్గేయకార మహోత్సవాలు - గాయత్రీ మహిళా సంగీత సన్మండలి - 04.10.2026

ముగిసిన వాగ్గేయకార మహోత్సవాలు సంగీత, సాహిత్యాల అద్భుత సంగమమే వాగ్గేయకార కళావైభవం అని దర్శనం ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక(హైదరాబాద్) సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ అన్నారు. ఆదివారం సాయంత్రం బృందావన్గార్డెన్స్ శ్రీవేంక టేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేది కపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న వాగ్గేయకార మహోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. తొలుత విద్వాం సులు వాగ్గేయకార కృతులను గానం చేశారు. సాయంత్రం సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంక టరమణశర్మ మాట్లాడుతూ సమాజంలో ఆధ్యా త్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం వాగ్గేయకార కళా వైభవం సంగీత రూపకం ప్రద ర్శించారు. నారద మహర్షిగా వైద్యులు వై.రమా ప్రభ, సరస్వతిగా టి. అన్నపూర్ణ, అన్నమయ్యగా గండూరి హర్షిత తదితర పాత్రల్లో నటించారు. పలు పాత్రల్లో కళాకారులు అద్భుతంగా నటించి గానం చేశారు. సభలో న్యూరోస్పయిన్ సర్జన్ వైద్యులు జె.నరేష్బాబు, సీహెచ్ఎల్ఎస్ హర్షిత, వస్కులర్ సర్జన్ ఎన్డీకే శశిధర్ సన్మండలి అధ్యక్షు రాలు డాక్టర్ పి.విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై.శేషురాణి, ఉపాధ్యక్షులు మాధవపెద్ది మీనాక్షి, డాక్టర్ రాజ...

ధార్మిక ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం - 04.10.2026

ధార్మిక ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, ధార్మిక ప్రాంగణంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎం.ఎల్.ఏ. గళ్ళా మాధవి గారి నేతృత్వంలో వికాస్ హాస్పటల్ సహకారంతో ఉచిత వైద్యశిబిరం విజయవంతంగా జరిగింది. బి.పి., షుగర్ వంటి సాధారణ పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, ఎముకల వైద్యనిపుణులు హాజరై పరీక్షలు జరిపి తగిన సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, గ్రంథాలయాధికారి ఎన్. సుభాషిణి, డాక్టర్ పంచుమర్తి కల్పన తదితరులు పాల్గొన్నారు. మహిళా విభాగం వ్యవస్థాపక అధ్యక్షురాలు గద్దె రామతులశమ్మ సూచనల మేరకు కార్యదర్శి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి, కోశాధికారిణి డాక్టర్ మైలవరపు లలితకుమారి గార్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆకట్టుకున్న వాగ్గేయకార కళావైభవం సంగీత రూపకం - 03.10.2026

ఆకట్టుకున్న వాగ్గేయకార కళావైభవం సంగీత రూపకం స్థానిక బృందావన్   గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎమ్.వై.శేషురాణి ఆధ్వర్యంలో వాగ్గేయకార మహోత్సవాలు అక్టోబర్ 3,4 వ తేదీలలో నిర్వహిస్తున్న క్రమంలో శనివారం   ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక విద్వాంసులచే వాగ్గేయకార కృతులను శ్రావ్యంగా గానం చేశారు.   సాయంత్రం   కార్యక్రమాలను కొంపల్లి లక్ష్మి అన్నపూర్ణమ్మ , కోటేశ్వరరావు దంపతులు , ముఖ్య అతిధి గౌరవ విశ్రాంత   న్యాయమూర్తి , ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎ.వి. శేషసాయి , గౌరవ అతిధి ఆంధ్రప్రదేశ్ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రామరాజు శ్రీనివాస్ , ఆత్మీయ అతిధి కళారత్న భూసురపల్లి వెంకటేశ్వర్లు , ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ వారు   జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్బంగా సభా కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వైణిక చక్రవర్తి , డీ. శ్రీనివాస్ , ( హైదరాబాద్) వారిని ఘనంగా సత్కరించి గౌరవించారు. ముఖ్యఅతిధి మాట్లాడుతూ సంగీతం మనః...

ఆకట్టుకున్న వార్నింగ్ నాటిక - నటనాలయ, గుంటూరు - 02.10.2026

ఆకట్టుకున్న వార్నింగ్ నాటిక నటనాలయ, గుంటూరు వారిచే జాతిపిత మహాత్మాగాంధి మరియు భారత రెండవ మాజీప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా కార్యక్రమము. తదుపరి జస్ట్ స్మైల్, తిరుపతి వారిచే వార్నింగ్ నాటిక ప్రదర్శన. రచన : కీ.శే. విద్యాధర్, దర్శకత్వం : శ్రీ జలదంకి రవీంద్ర.

ఆకట్టుకున్న సంగీత కదంబ కార్యక్రమము - 01.10.2026

ఆకట్టుకున్న సంగీత కదంబ కార్యక్రమము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం సాయిశృతి మ్యూజిక్ అకాడమీ ఆర్. ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో సంగీత కదంబ కార్య్రకమము. కార్యక్రమాలను ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం యువకళాకారులచే గాత్రం, వయోలిన్, కీబోర్డు, తబల, డ్రమ్స్, వీణా, మృదంగంతో పాటు 12 వివిధ రకాల వాయిద్యలలో ఆర్. ప్రేమ్ కుమార్ వద్ద శిక్షణ పొందిన విద్యార్దినీ, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభతో కళాభిమానులను అలరించారు.