ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

తిరుప్పావై 9వ పాశురం పై ప్రవచనం - 24.12.2024

 తిరుప్పావై 9వ పాశురం పై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి గారిచే తిరుప్పావై 9వ పాశురంపై ప్రవచనం చేశారు. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కె.వి. రంగనాయకి ప్రవచిస్తూ నవరత్నాలతో పొడగబడి నిర్మించిన మేడ ఇది పరమాత్మకు మనకు మధ్య ఉన్న నవవిధ సంబంధాన్ని సూచిస్తే, దాని చుట్టూ కాంతులీనుచున్న దీపములు, గోపిక యొక్క జ్ఞానాన్ని సూచిస్తున్నాయన్నారు. శ్రవణం, మననం వల్ల మనోమాలిన్యాల దోషాలు దూరమై భగవత్ జ్ఞానం అనే కవచంతో భగవంతుడు తప్ప ఇతరమైన కోరికలపై సృహలేని స్థిత ప్రజ్ఞత స్థితికి చేరినది ఈ గోపికని అన్నారు. అలాంటి గోపిక లేచి తమకు మార్గదర్శనం చేయమని ప్రార్ధిస్తుంది గోదాదేవి ఈ రోజు పాశురంలో తెలిపింది సవివరంగా భగవత్ భక్తులకు తెలియజేశారు.

తిరుప్పావై 9వ పాశురం పై ప్రవచనం - 24.12.2024

 తిరుప్పావై 9వ పాశురం పై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి గారిచే తిరుప్పావై 9వ పాశురంపై ప్రవచనం చేశారు. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కె.వి. రంగనాయకి ప్రవచిస్తూ నవరత్నాలతో పొడగబడి నిర్మించిన మేడ ఇది పరమాత్మకు మనకు మధ్య ఉన్న నవవిధ సంబంధాన్ని సూచిస్తే, దాని చుట్టూ కాంతులీనుచున్న దీపములు, గోపిక యొక్క జ్ఞానాన్ని సూచిస్తున్నాయన్నారు. శ్రవణం, మననం వల్ల మనోమాలిన్యాల దోషాలు దూరమై భగవత్ జ్ఞానం అనే కవచంతో భగవంతుడు తప్ప ఇతరమైన కోరికలపై సృహలేని స్థిత ప్రజ్ఞత స్థితికి చేరినది ఈ గోపికని అన్నారు. అలాంటి గోపిక లేచి తమకు మార్గదర్శనం చేయమని ప్రార్ధిస్తుంది గోదాదేవి ఈ రోజు పాశురంలో తెలిపింది సవివరంగా భగవత్ భక్తులకు తెలియజేశారు.

అలరించిన సినీ సౌరభాలు - మహతి స్వరసుధ - 22.12.2024

అలరించిన సినీ  సౌరభాలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య  కళావేదికపై మహతి స్వర సుధ  ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సినీ సౌరభాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని గాయకులు పత్రి నిర్మల,  జి వీరయ్య, డి.టి. సాయి బాబా, డాక్టర్ ఏ వీర రాఘవ, వై ఈశ్వరరావు ఎస్ కే వలీ, బి కృష్ణ ప్రసాద్, సిహెచ్ రాజ్యలక్ష్మి, వై. హేమమాలిని, ఎం ఎన్ ప్రసన్నలక్ష్మి,   డాక్టర్ జె ముకుందప్రియ, ఎన్.లక్ష్మి,టి రమాదేవి, ఎం కృష్ణ, బి ప్రద్యుమ్న  లు తమ గాత్రధారణ లొ అలనాటి మేటి చిత్రాల్లోని పలు  మధుర గీతాలను  శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై కే రవిబాబు, తబలాపై ఎస్ వెంకట్, ప్యాడ్స్ పై ఎన్ బి సైదులు  వాయిద్య సహకార అందించారు కార్యక్రమానికి బి.కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.కె.మదన్ మోహన్‌రావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

పెరవలి సిస్టర్స్ – శాస్త్రీయ సంగీత కచేరి – 21.12.2024

పెరవలి సిస్టర్స్ – శాస్త్రీయ సంగీత కచేరి – 21.12.2024 స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల వారి నెలనెల కార్యక్రమంలో భాగంగా పెరవలి సిస్టర్స్‌చే శాస్త్రీయ సంగీత కచేరి జరిగింది. వీరికి మృదంగం బి. సురేష్, వయోలిన్ నందకుమార్, ఘటం హరిబాబు చక్కటి వాయిద్య సహకారం అందించారు.

మంగళాశాసనం పాశురం, వామనావతార వైభవ విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనం - 18.12.2024

మంగళాశాసనం పాశురం, వామనావతార వైభవ విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై ధనుర్మాస మహో త్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం మంగళాశాసనం పాశురం, వామనావతార వైభవ విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శ ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రసంగిస్తూ ‘మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!’ అని అండాళ్ తల్లి స్వామి ఆయా అవతారాల్లో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడిందని అన్నారు. వ్యాస భాగవతంలోని ఘట్టం మూలమైనా తెలుగు వారిలో పోతన శ్రీమదాంధ్ర భాగవతంలోని వామన చరిత్రమే సుప్రసిద్ధమని భగవత్ భక్తులకు సవివరంగా తెలిపారు.

తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం - డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకి - 16.12.2024

తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై ఆధ్యాత్మిక ప్రవచనాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం గోదా అమ్మవారి మూలవిరాట్‌కు వివిధ పల రసాలు , పంచామృతాలతో అభిషేకం , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకి తిరుప్పావై ప్రవచనం చేస్తూ కార్తిక మాసం లాంటిదే ధనుర్మాసమన్నారు. కాత్యాయిని వ్రతం విశిష్టత , గోదాదేవి అమ్మవారి ఆవిర్భా వాన్ని తొలి పాశురంలోని విశేషాలు వివరించారు.

అలరించిన సంగీత విభావరి – 15.12.2024

అలరించిన సంగీత విభావరి – 15.12.2024 బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళాంజలి , గుంటూరు వారిచే నిర్వహించిన సుమధుర సంగీత విభావరి కార్యక్రమం ఆల రించింది. గాయనీగాయకులు సత్యవర్ధన్ , సుధీర్ , సాంబశివరావు , రమేష్ , గాయత్రి గాత్ర ధారణలో అలనాటి సినీ భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై రవిబాబు. తబలపై వెంకట్ , ప్యాడ్సైపై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.

రామ నామ సంకీర్తనం.. భక్తి పారవశ్యం – 14.12.2024

రామ నామ సంకీర్తనం.. భక్తి పారవశ్యం – 14.12.2024 భజరే గోపాలం నామ సంకీర్తనం భక్తులను భక్తి పారవశ్యంతో పరవశింపజేసింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బి.ఆర్. గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై శనివారం లింగం చంద్రశేఖర్ , గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో భజరే గోపాలం నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకు చెందిన నాదోపాసకులు శ్రీరామపాద భాగవతార్ , రమాశ్రీరామ్ , గోకుల్ కృష్ణ , విక్రమ్ , హరిరహర న్లు గాత్రధారణలో వాగ్గేయకారుల సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఆదిశంకర , భగవత్పాద , అన్నమాచార్య. రామదాసు కీర్తనలను శ్రీరామపాద భాగవతార్ స్వరబద్ధంగా రామనామంతో ప్రారంభించి.. హనుమంతుని స్తుతితో మంగళం పాడారు. శ్రీరామపాదకు రమా శ్రీరామ్ గాత్ర సహకారం అందించగా హార్మోనియంపై మృదంగంపై గోపాల్ , డోలక్‌పై సాకేత్‌రామ్ వాయిద్య సహకారం అందించారు. శ్రీరామ పాద భాగవతార్ మాట్లాడుతూ పవిత్రమైన రామనామ సంకీ ర్తన ఈ వేదికపై కచేరి చేయడం తనకు లభించిన భాగ్యమన్నారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవ స్థాపక కార్యదర్శి బొల్లేపల్లి సత్యనారాయణ , ఆలయ పాలక కమిటీ అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య , ...

గాంధీ మహాత్ముని ఆస్థాన కవి తుమ్మల – అప్పాజోస్యుల సత్యనారాయణ – 13.12.2024

 గాంధీ మహాత్ముని ఆస్థాన కవి తుమ్మల – అప్పాజోస్యుల సత్యనారాయణ – 13.12.2024 గాంధీ మహాత్ముని ఆస్థానకవి తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి రుషి వంటి కవి అని ఆచార్య అప్పోజోస్యుల సత్యనారాయణ అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు తుమ్మల సాహిత్య పురస్కార ప్రదానం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తుమ్మల సాహిత్య విశేషాలను విశ్లేషించి చెప్పారు. తుమ్మల సీతారామమూర్తి గురించి కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ప్రముఖులు ఎంతో గొప్పగా పేర్కొన్నారన్నారు. ఆటవెలది, తేటగీతి, కందం లాంటివే కాక అన్ని ఛందస్సులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ఎంతో గొప్పగా ఆయన కవిత్వం కనిపి స్తుందన్నారు. ఆయన రాసిన రైతుకవి త్వంలో తెలుగు రైతన్నల జీవన సరళి స్పష్టంగా చూడొచ్చన్నారు. గాంధీజీ ఆస్థానకవిగా ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరమని, చాలామంది కవులలాగా తాత్కాలిక ప్రయోజనాల దృష్టితో కాక కాలాతీత కవిత్వ రచన చెయ్యబట్టే 124 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతిని చేసుకుంటూ స్మరించుకొంటున్నాము న్నారు. వేదికపై ఆచార్య అప్పాజోస్యుల సాంస్కృ తిక సేవలకు గుర్తింపుగా తుమ్మల కళాపీఠం పురస్కారాన్ని...

శ్రీమద్భాగవతం ప్రవచనాలు – మల్లాది కైలాసనాథ్ – 10.12.2024

శ్రీమద్భాగవతం ప్రవచనాలు – మల్లాది కైలాసనాథ్ – 10.12.2024 స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీమద్భాగవతం ధారావాహిక ప్రవచనాలు ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తా నయ్య , సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు జ్యోతిప్రజ్వలన చేశారు. బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాథ్ ప్రసంగిస్తూ విజయాన్ని భగవద్గీత సాధించి పెడుతుందని అన్నారు. నేటి యువత విధిగా భగవద్గీత చదవాలని చెప్పారు. అందులోని అంశాలను అర్థం చేసు కుని , జీవితాలకు అన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. ఆచరించిన ప్రతి ఒక్కరికి విజయాన్ని అందించే గ్రంథం భగవద్గీత అని పేర్కొన్నారు.

రైతుల జీవిత దర్పణం.. పడమటి గాలి – 10.12.2024

రైతుల జీవిత దర్పణం.. పడమటి గాలి – 10.12.2024 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై పండు క్రియేషన్స్, కొప్పోలు (ఒంగోలు) వారి నాటకోత్స వాల్లో భాగంగా మంగళవారం రాత్రి ప్రదర్శించిన పడమటి గాలి సంక్షిప్త నాటకం సందేశాత్మకంగా సాగింది. భార్యాభర్తల అనుబందాన్నీ, కన్నవాళ్లకూ బిడ్డలకూ మధ్య మమకారాన్ని ధ్వంసం చేస్తున్న ఆర్థిక సంబంధాలు, రైతుకూలీని రైతుకు దూరం చేస్తున్న విషాదాలు, రైతుకు ప్రాణాధారమైన భూమిని తనకి కాకుండా చేయాలన్న బడాబాబుల కుట్రలు, అనైతిక శారీరక సంబం ధాలు, కట్నాల కోసం వెంపర్లాటలు, అమెరికా వ్యామోహాలను నాటకం ప్రతిబింబించింది. డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు రచనకు, గుమ్మళ్ల బల రామయ్య దర్శకత్వం వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్ర సాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని పడమటి గాలి నాటకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో కందిమళ్ల సాంబశివరావు, సత్యనారాయణ, దేవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉన్నం వెంకట శేషయ్య నిర్వహించారు.

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తన లహరి – 08.12.2024

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తన లహరి – 08.12.2024 స్థానిక బృందావ న్‌గా ర్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన లహరి నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉషారాణి బృందంతో గణపతి , అన్నమయ్య శ్లోకాలు , ఆదిమూలమే , వేదం వేపని పెరిగినాడు , గోవిందా గోవిందా , అప్పని వరప్రసాది , అంతయు నీవే , నగ దరా నందగోపాల , తిరు వీధులకు మెరిసిని , వాడ వాడల వెంట , జయ మం గళం అంటూ పలు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించగా , అలరించాయి. వయోలిన్పై పాలేటి గోవర్ధన్రావు , మృదంగం కేవీ కిషోర్ వాయిద్యాన్ని అందించారు.

పాటిబండ్ల జానకి గారికి రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు ప్రదానం – 07.12.2024

జానకికి రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు ప్రదానం – 07.12.2024 స్థానిక బృందావ న్‌గా ర్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శని వారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యం లో రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ నిర్వహించారు. సన్మండలి అధ్యక్ష , కార్యదర్శులు డాక్టర్ పి.విజయ , ఎంవై. శేషురాణి అధ్య క్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం విశ్రాంత ఆచార్యులు పాటిబండ్ల జానకికి రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. డాక్టర్ అన్నవరపు రామస్వామి తన చేతికున్న సువర్ణ ఘంటా కంకణాన్ని శిష్యురాలు పాటిబండ్ల జానకికి బహూకరించి , ఆశీర్వదించారు. సభానంతరం విదుషి కార్తీక అనఘ(లం డన్) శాస్త్రీయ సంగీత కచేరి అలరించింది. వయోలి న్పై బీవీ దుర్గాభవాని(విజయవాడ) , మృదంగంపై విద్వాన్ బి.సురేష్ బాబు చక్కటి వాయిద్యాన్ని అందిం చారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమ , ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి , పి. లలితాదేవి , కార్యదర్శి ఎ. మంగాదేవి పాల్గొన్నారు.

అలరించిన నారాయణ తీర్థుల తరంగాలు -06.12.2024

అలరించిన నారాయణ తీర్థుల తరంగాలు -06.12.2024 బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై శుక్రవారం నాగార్జున సాంస్కృతిక కేంద్రం , నాగార్జున సంగీత కళాశాల సంయుక్తంగా శ్రీనారాయణ తీర్థుల తరంగాలు అనే గాత్ర కచేరి నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ ఎన్. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సంపత్ కుమార్ ఆలపించగా తరంగాలు శ్రోతలను అలరించాయి. ముఖ్య అతిథిగా డీఆర్ఎం సి.రామకృష్ణ , శంకర కంటి ఆస్పత్రి చీఫ్ మెడికల్ అధికారి పి.సుధాకర్ హాజరై మాట్లాడారు. నాగార్జున కల్చరల్ సెంటర్ కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి , నాగార్జున స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కార్యదర్శి డాక్టర్ ఎం. శ్రీధర్ , ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయ ణలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

త్రిశూలం నాటికల సంపుటి ఆవిష్కరణ - 05.12.2024

త్రిశూలం నాటికల సంపుటి ఆవిష్కరణ - 05.12.2024 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కళావిపంచి , ఆరాధన ఆర్ట్స్ అకాడమీ , నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ సౌజన్యంతో ఉషోదయ కళానికేతన్ 18 వ వార్షిక వేడుకలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి చెరుకూరి సాంబశివరావు రచించిన త్రిశూలం నాటికల సంపుటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్క రించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నాటక ప్రయోక్త కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. రంగస్థల , సినీ నటుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు , కేసీపీ ఇండియా లిమిటెడ్ ఉపాధ్యక్షుడు వజ్జా మధుసూదనరావు , రంగస్థల ప్రము ఖులు జరుగుల రామారావు , కావూరి సత్య నారాయణ , ఆలయ పాలకమండలి అధ్య క్షుడు సీహెచ్ మస్తానయ్య , నటుడు మానా పురం సత్యనారాయణ , బ్రేక్ ఇన్స్పెక్టర్ బి. మధుసూదనరావు , కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు తదితరులు పాల్గొ న్నారు. తొలి ప్రతిని డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబుకు చెరుకూరి సాంబశివరావు అందించారు. అనంతరం ఉషోదయ కళానికేతన్ , కట్రపాడు వారి నిర్వహణలో చెరుకూరి సాంబశివరావు రచన , దర్శకత్వంలో కిడ్నాప్ న...

నాటకరంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – 04.12.2024

నాటకరంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – 04.12.2024 నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ చెప్పారు. ఉషోదయ కళానికేతన్ 18 వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఉషోదయ కళానికేతన్ సంస్థలో నటించిన నటీనటులను ఆయన సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటకాల అభివృద్ధికి ఉషోదయ కళానికేతన్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భారతీయ సంస్క ృ తిలో భాగమైన కళలను అంతరించిపోకుండా కాపాడుకున్న సంస్థలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో కూడా నాటక రంగం ద్వారా అనేకమంది సేద తీరుతున్నారన డంలో అతిశయోక్తి లేదదన్నారు. అనంతరం సంస్థ వారు మన్నవ మోహనకృష్ణను సన్మానించారు.

ఆకట్టుకున్న ఇంద్రజాల ప్రదర్శన

 ఆకట్టుకున్న ఇంద్రజాల ప్రదర్శన ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణ వేదికపై ఏ.పి. మెజీషియన్స్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన విశిష్ట ఇంద్రజాల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్.యల్. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మెజీషియన్స్ డాక్టర్ ఆర్నల్, జె.వి.ఆర్., అద్దంకి నాగరాజు, డాక్టర్ పి.వి. రామ్‌కుమార్, నాగేంద్ర గార్లు చేసిన ఇంద్రజాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో పెద్దలు, పిల్లలు హాజరై ఇంద్రజాల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న మెజీషియన్స్‌ను ఆర్.యల్. ప్రసాద్ ఘనంగా సత్కరించారు.