ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక - 06.11.2026

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఈశ్వర వరప్రసాద్ పరిషత్ నిర్వహణలో సంస్కృతి వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్ స్మత్యర్ధం శుక్రవారం అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ఇది అతని సంతకం నాటకం సందేశాత్మకంగా సాగింది.   తొలుత సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలచందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాల్ళర్పించారు. కృష్ణమూర్తి అబద్ధం లేని జీవితాన్ని గడిపాడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రయాణించాడు. వేసిన ప్రతి అడుగులోను ప్రత్యేకతను చాటుకొన్నాడు. జీవితపు చరమాంకంలో దంపతులు ఎలా బతకాలో ప్రణాళిక రచించుకొన్నాడు. ఆ ఆలోచనను నిజం చేసుకొన్నాడు. బతికే విధానాన్ని చిత్రించుకొని సంతకం చేసుకొన్నాడు. అందుకే అభినయ ఆర్ట్స్ స్నిగ్ధ రచనకు, యన్. రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఇది అతని సంతకం నాటికను ప్రదర్శించారు. ఇందులో యన్. రవీంద్రరెడ్డి, వి.సిహెచ్.కె. ప్రసాద్, యన్. సూర్య, ట...

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక - 06.11.2026

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఈశ్వర వరప్రసాద్ పరిషత్ నిర్వహణలో సంస్కృతి వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్ స్మత్యర్ధం శుక్రవారం అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ఇది అతని సంతకం నాటకం సందేశాత్మకంగా సాగింది.   తొలుత సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలచందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాల్ళర్పించారు. కృష్ణమూర్తి అబద్ధం లేని జీవితాన్ని గడిపాడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రయాణించాడు. వేసిన ప్రతి అడుగులోను ప్రత్యేకతను చాటుకొన్నాడు. జీవితపు చరమాంకంలో దంపతులు ఎలా బతకాలో ప్రణాళిక రచించుకొన్నాడు. ఆ ఆలోచనను నిజం చేసుకొన్నాడు. బతికే విధానాన్ని చిత్రించుకొని సంతకం చేసుకొన్నాడు. అందుకే అభినయ ఆర్ట్స్ స్నిగ్ధ రచనకు, యన్. రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఇది అతని సంతకం నాటికను ప్రదర్శించారు. ఇందులో యన్. రవీంద్రరెడ్డి, వి.సిహెచ్.కె. ప్రసాద్, యన్. సూర్య, ట...

ఘనంగా నటరాజ సంగీత నృత్య కళాశాల వార్షికోత్సవం - 05.11.2026

ఘనంగా నటరాజ సంగీత నృత్య కళాశాల వార్షికోత్సవం నటరాజ సంగీత నృత్య కళాశాల 21వ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు పద్మావతి కళ్యాణవేదికపై నిర్వహించారు. తొలుత ఆలయ అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య, ఆలయ కమిటీ సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, కాజ వెంకట సుబ్రహ్మణ్యం, శనక్కాయల రాధా మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజానన యుతం గణేశ్వరం, రామాయణ శబ్దం, పుష్పాంజలి, చరణములే నమ్మితి, గోవింద నామాలు, జయ జయ దుర్గే, దశావతార శబ్దం, తక్కువేమి మనకు, వినాయకౌత్వం,కృష్ణం కలయసఖి, నాట్య హేల అను కూచిపూడి నృత్యంశాలను చిన్నారులు ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యము ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిధుల చేతుల మీదుగా చిన్నారులకు జ్ఞాపికలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నృత్య దర్శకత్వం వహించిన నాట్యాచారిని ఆనంతుల విజయ కుమారిని అభినందించారు. కార్యక్రమాన్ని అనంతుల ప్రణయనాథ రెడ్డి, విజయ కుమారి పర్యవేక్షించారు.

నటనాలయం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు - 04.11.2026

నటనాలయం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు నటనాలయం, గుంటూరు ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దినోత్వవ వేడుకలను బుధవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పద్మావతి కళ్యాణ వేదికపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటులు కీ.శే. పూజ్యం నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన ఆత్మీయ పురస్కారాన్ని పొన్పూరు నాటక కళాపరిషత్ అధ్యక్షులు శ్రీ సూరినేని అంజనేయులు నాయుడుకు ప్రదానం చేసి ఘనంగా సత్యరించారు. నటనాలయం, గుంటూరు ఆధ్యక్షులు నీలం మందారావు సభను నిర్వహించగా, డాక్టర్ పట్టాభి కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ తూమలూరి రాజేంద్ర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో శ్రీనివాస్, ఆరాధన ఆర్ట్స్, గుంటూరు అధ్యక్షులు డి. తిరుమలేశ్వరరావు, దేవస్థాన ప్రచాన కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, ప్రముఖ రచయిత, దర్శకులు కళారత్న కావూరి సత్యనారాయణ తదితరులు వేదికను అలంకరించారు. రంగస్థల కళారంగానికి విశేష సేవలందిస్తున్న సూరినేని ఆంజనేయులు నాయుడుకు ఆత్మీయ పురస్కారం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కళాకారులను గౌరవించడం, నాటకరంగ సేవలను గుర్తించడం అభినందనీయమని వక్షలు సభా...

శ్రీకాళహస్తి మాహాత్మ్యంపై ప్రవచనము - 02.11.2026

శ్రీకాళహస్తి మాహాత్మ్యంపై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం  సూరపనేని శ్రీరామచంద్రమూర్తి, జయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో  ప్రముఖ సాహితీవేత్త యం.వి. సత్యవతి గారిచే శ్రీకాళహస్తి మాహాత్మ్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యం.వి. సత్యవతి ప్రవచిస్తూ శ్రీకాళహస్తి అనేది కేవలం ఒక దివ్య పుణ్యక్షేత్రం మాత్రమే కాక , నిర్మలమైన శివభక్తికి, నిష్కామ ప్రేమకు ప్రతీకగా నిలిచే అద్భుత ఆధ్యాత్మిక నిలయమన్నారు. స్వర్ణముఖీ నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రంలో శ్రీ అంటే సాలెపురుగు తన నూలు దారాల పందిరితో , కాళము  అంటే పాము పాతాళ లోకం నుండి తెచ్చిన రత్నాలతో , హస్తి అంటే ఏనుగు నదీ జలాలు, బిల్వపత్రాలతో పరమశివుడిని ఆరాధించి సాయుజ్య ముక్తిని పొందాయన్నారు. ఈ మూడు జీవుల అనన్య ఆరాధనకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ఆవిర్భవించాడన్నారు.

అలరించిన నర్తనశాల హరికథాగానం - 01.11.2026

అలరించిన నర్తనశాల హరికథాగానం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం   కళ్ళం హరనాథరెడ్డి జయంతి సందర్భంగా వారి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా వేదవతి భాగవతారిణి చే నర్తనశాల (కీచకవధ) హరికథాగానం పద్యాల శ్రావ్యంగా గానం చేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. వీరికి కీబోర్డుపై నాగమల్లేశ్వరరావు, తబలపై లక్ష్మీనారాయణ వాయిద్య సహకారం అందించారు. తొలుత కళ్ళం హరనాథరెడ్డి కుటుంబసభ్యులు, ఆలయ కమిటి సహాయకార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళ్ళంహరనాథరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహాభారతంలోని కీచకవధలోని అనేక ఘట్టాలను, పాండవ అజ్ఞాతవాస విశేషాలను వివరించారు. సంస్థ వారు వేదవతి భాగవతారిణిని, కళాకారులను ఘనంగా సత్కరించారు.

పాటిబండ్ల సీతారామయ్య స్మారక సేవాసమితి వారి సాంస్కృతిక కార్యక్రమము - 31.10.2026

పాటిబండ్ల సీతారామయ్య స్మారక సేవాసమితి వారి సాంస్కృతిక కార్యక్రమము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారము పాటిబండ్ల సీతారామయ్య స్మారక సేవాసమితి వారి ఆధ్వర్యంలో పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పాటిబండ్ల సీతారా మయ్య 144వ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజి గారు పాల్గొని రాజకీయమంటే అందలం ఎక్కడం కోసం కాదు. సేవా దృక్పథం కలిగి ఉండాలి. నేటి రాజకీ యాల్లో విలువలు పూర్తిగా పోయాయి. ప్రజలు రాజకీయ పార్టీలను మారుస్తున్నారే కానీ.. రాజకీయ నాయకులను మార్చలేకపోతున్నారు. రైతుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు యలమంచిలి శివాజీ అని కొనియాడారు. రైతులను సంఘటితం చేసేందుకు ఎంతో పాటు పడ్డారని, ఆయన కృషి ఫలితంగానే అప్పట్లో క్రాప్ హాలిడే, రైతు రుణమాఫీ వంటివి అమల్లోకి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు కేవలం మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, మానవత్వం, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని  సూచించారు. విద్య అనేది వ్యక్తిగత అభివృద్ధికే కాక...

నిష్టాతులకు వేదిక ఆత్మీయ పురస్కారాలు - 30.10.2026

నిష్టాతులకు వేదిక ఆత్మీయ పురస్కారాలు   స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై వేదిక డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు ఆధ్వర్యంలో నిష్టాతులకు ఆత్మీయ పురస్కార ద్వితీయ సభ జరిగింది.  అతిధులుగా    వేదిక  ఉపాధ్యక్షులు జి. పాండురంగారావు , ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. పురస్కార గ్రహీతలు నటులు , దర్శకులు , కే.ఎస్.టి. సాయి , ప్రధాన కార్యదర్శి , ఆంధ్రనాటక కళాపరిషత్ , అన్నమనేని ప్రసాద్ , కళాపోషకులు కిలారు వెంకటరావులకు వేదిక పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించారు.  సభానంతరం కళారత్న గుమ్మడి గోపాల కృష్ణ బృందంచే ప్రదర్శించబడిన శ్రీకృష్ణ రాయబారం లోని ఘట్టం ఆహుతులను అలరించింది. సంస్థ వారు కళాకారులను ఘనంగా సత్కరించారు. జి. మల్లికార్జునరావు , భాగీ శివశంకరశాస్త్రి ,  డి.తిరుమలేశ్వరరావు , పి. నాగేశ్వరరావు,  వి. నాగేశ్వరరావు, నడింపల్లి వెంకటేశ్వర్లు, చెరుకూరి సాంబశివరావు  తదితరులు పాల్గొని కార్యక్రమాలను ...

నరములు, వాస్కులర్ పై అవగాహన సదస్సు - 29.10.2026

నరములు, వాస్కులర్ పై అవగాహన సదస్సు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య కళావేదికపై గురువారం కిమ్స్ శిఖర హాస్పిటల్స్, సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నరములు, వాస్కులర్ సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ అధ్యక్షులు మన్నె సుబ్బారావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  డాక్టర్ సురపనేని ఫణీంద్రబాబు, డాక్టర్ బి. నవీన్ వెంకట్ లు పవర్ పాయింట్ ప్రజంటేషణ్ ద్వారా నరములు, రక్తనాళాలు వ్యవస్థలు శరీరంలో నాడీ సంకేతాలను, రక్త ప్రసరణను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మధుమేహం , అధిక రక్తపోటు , ధూమపానం , అధిక కొలెస్ట్రాల్ శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ వ్యవస్థలు దెబ్బతింటాయన్నారు. నరాల సమస్యల వల్ల కాళ్లు , చేతుల్లో తిమ్మిర్లు , మంటలు , స్పర్శ కోల్పోవడం పక్షవాతం వంటివి వస్తాయన్నారు. వాస్కులర్ వ్యాధుల వల్ల కాళ్ల ధమనుల్లో అడ్డంకులు , వెరికోస్ వేన్స్ , రక్తం గడ్డకట్టడం, నడిచేటప్పుడు త...

కార్తీక మాస విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం - 28.10.2026

కార్తీక మాస విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పద్మావతి కళ్యాణవేదికపై బుధవారం కార్తీకమాస విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యుల జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాది కైలాసనాధ్ ప్రవచనం చేస్తూ   ఈ కార్తీకమాసం పరమశివునికి, శ్రీమహావిష్ణువునకు ఇద్దరికీ ప్రీతికరమైన మాసమన్నారు. ఈ మాసంలో మనం పాటించే ఆచారములలో ఎంతో వైజ్ఞానిక కోణము ఉన్నదన్నారు. స్నాము, దీపారాధన, ఉపవాసము మొదలగు నియమాలన్నీ మన ఆరోగ్యం కోసం రుషులు ఏర్పరచినవన్నారు. కార్తీక వనభోజనాలు కులము, మతము మొదలగు వాటి ప్రాతిపదికన కాకుండా, అందరం కలిసి ఆనందంగా జరుపుకోవలసివనీ తద్వారా సమాజంలో పరస్పరత్వము పెరుగుతుందన్నారు. ఉపవాసము చేయుట ద్వారా రాబోయే చలికాలాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి కలుగుతుందన్నారు.

ప్రముఖ రంగస్థల నటీమణులకు బొప్పన పురస్కారం - 27.10.2026

ప్రముఖ రంగస్థల నటీమణులకు బొప్పన పురస్కారం   స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళాపోషకులు బొప్పన నరసింహారావు (బుజ్జి ) 70 వ జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రముఖ రంగస్థల నటీమణులకు బొప్పన ఆత్మీయ పురస్కార ప్రధానం జరిగింది. యువకళావాహిని , ఆరాధన ఆర్ట్స్ అకాడమీ , డాక్టర్ రామరాజు ఫౌండేషన్ , నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ , ఎన్టీఆర్ కళాపరిషత్ , వై.కె.నాటక పరిషత్ , ఉషోదయ కళానికేతన్ , కళావిపంచి సంస్థల సంయుక్త నిర్వహణలో   నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువకళావాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. అతిథులుగా న్యాయమూర్తి మైలబత్తుల శోభారాణి, కె.సి.పి. వైస్ ఛైర్మన్ వఝ్ఝ మధుసూధనరావు, డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, కళాపత్రిక సంపాదకుడు డాక్టర్ మహామ్మద్ రఫీ, కధక్ కళాక్షేత్రం అధ్యక్షులు డాక్టర్ కధక్ అంజిబాబు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, శారదా కళాసమితి అధ్యక్షులు డోగిపర్తి శంకరరావు, ఆలయ కమిటి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొ...

శక్తిపీఠాలు మహిళా శక్తికి ప్రతీకలు - 26.10.2026

శక్తిపీఠాలు మహిళా శక్తికి ప్రతీకలు ఆదిపరాశక్తి అనేక రూపాలలో , విభిన్న నామాలలో కొలువుదీరిన శక్తిపీఠాలు మహిళా శక్తికి ప్రతీకలని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర ఆలయం అన్నమయ్య కళావేదికపై జరిగిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగంవారి కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. అష్టాదశ శక్తిపీఠాలు భారతీయ సంస్కృతి , చరిత్ర , కళా కేంద్రాలని , మహారాష్ట్ర కొల్లాపూర్ మహాలక్ష్మి పీఠం మహారాష్ట్రుల నాగరికతకు ప్రతిబింబం వంటిదని వివరించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి మాట్లాడుతూ శక్తిపీఠం విశేషాలను చారిత్రక ప్రాధాన్యాన్ని గురించి ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి శక్తిపీఠాలు మహిళలలో శక్తికి సృష్టి కేంద్రాలని వర్ణించారు. దేవాలయ పాలక మండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య , సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. మహిళా విభాగం సభ్యులు శ్రీమతి చందు హనుమాయమ్మ , విజయలక్ష్మి , సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

అపర భగీరధుడు డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి - 25.10.2026

అపర భగీరధుడు డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి సి.పి. బ్రౌన్ అనే మట్టిలోనే మాణిక్యాన్ని వెలికి తీసిన అపర భగీరథుడు డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు అన్నారు. కడప సి.పి. బ్రౌన్ భాష పరిశోధన కేంద్ర ప్రాంగణంలోని బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరంలో డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి 101వ జయంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణకు 15వ గ్రంథాలయ, సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది.  సభలో  ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య జి.యన్.రెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, జిల్లా న్యాయమూర్తి రామ్ గోపాల్, మాశర్మ, జానుమద్ది విజయభాస్కర్ తదితరులు పాల్గొని లంకా సూర్యనారాయణను గ్రంథాలయ సాహిత్య సేవా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 25.10.2026

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ఆది వారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 12మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి , శివలింగానికి , నవగ్రహాలకు విశేష అభిషేకాలు , అర్చనలు , లక్ష్మీగణపతి , చండీ , రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

ఆకట్టుకున్న లీలాకృష్ణం కూచిపూడి నృత్యరూపకం - 25.10.2026

ఆకట్టుకున్న లీలాకృష్ణం కూచిపూడి నృత్యరూపకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి సౌజన్యంతో శ్రీ నృత్య ఆర్ట్ అకాడమీ, విజయవాడ   నాట్యాచార్యులు భాగవతుల వేంకటరామశర్మ 25 మంది శిష్యబృందంచే లీలాకృష్ణం కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకృష్ణ లీలామృతంలోని పూతన భండికాసురుడు, సుడిగాలి రాక్షసుల వధ, గోపికా వస్త్రాపహరణం వంటి అనేక ఘట్టాలను సౌమ్య శ్రీకృష్ణుడుగా, శిష్యులు చక్కటి హావభావాలతో నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు, సంస్థ కన్వీనర్ గుళ్ళపల్లి రాఘవేంద్రరావు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుళ్ళపల్లి సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో కళాకారులను ఘనంగా సత్కరించారు.