కార్తీక మాస విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పద్మావతి కళ్యాణవేదికపై బుధవారం కార్తీకమాస విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యుల జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాది కైలాసనాధ్ ప్రవచనం చేస్తూ ఈ కార్తీకమాసం పరమశివునికి, శ్రీమహావిష్ణువునకు ఇద్దరికీ ప్రీతికరమైన మాసమన్నారు. ఈ మాసంలో మనం పాటించే ఆచారములలో ఎంతో వైజ్ఞానిక కోణము ఉన్నదన్నారు. స్నాము, దీపారాధన, ఉపవాసము మొదలగు నియమాలన్నీ మన ఆరోగ్యం కోసం రుషులు ఏర్పరచినవన్నారు. కార్తీక వనభోజనాలు కులము, మతము మొదలగు వాటి ప్రాతిపదికన కాకుండా, అందరం కలిసి ఆనందంగా జరుపుకోవలసివనీ తద్వారా సమాజంలో పరస్పరత్వము పెరుగుతుందన్నారు. ఉపవాసము చేయుట ద్వారా రాబోయే చలికాలాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి కలుగుతుందన్నారు.
.jpeg)

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి