అలరించిన నర్తనశాల హరికథాగానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం కళ్ళం హరనాథరెడ్డి జయంతి సందర్భంగా వారి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా వేదవతి భాగవతారిణి చే నర్తనశాల (కీచకవధ) హరికథాగానం పద్యాల శ్రావ్యంగా గానం చేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. వీరికి కీబోర్డుపై నాగమల్లేశ్వరరావు, తబలపై లక్ష్మీనారాయణ వాయిద్య సహకారం అందించారు. తొలుత కళ్ళం హరనాథరెడ్డి కుటుంబసభ్యులు, ఆలయ కమిటి సహాయకార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళ్ళంహరనాథరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహాభారతంలోని కీచకవధలోని అనేక ఘట్టాలను, పాండవ అజ్ఞాతవాస విశేషాలను వివరించారు. సంస్థ వారు వేదవతి భాగవతారిణిని, కళాకారులను ఘనంగా సత్కరించారు.



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి