అపర భగీరధుడు డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి
సి.పి. బ్రౌన్ అనే మట్టిలోనే మాణిక్యాన్ని వెలికి తీసిన అపర భగీరథుడు డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు అన్నారు. కడప సి.పి. బ్రౌన్ భాష పరిశోధన కేంద్ర ప్రాంగణంలోని బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరంలో డాక్టర్ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి 101వ జయంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణకు 15వ గ్రంథాలయ, సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. సభలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య జి.యన్.రెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, జిల్లా న్యాయమూర్తి రామ్ గోపాల్, మాశర్మ, జానుమద్ది విజయభాస్కర్ తదితరులు పాల్గొని లంకా సూర్యనారాయణను గ్రంథాలయ సాహిత్య సేవా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

.jpeg)

.jpeg)

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి