శ్రీకాళహస్తి మాహాత్మ్యంపై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం సూరపనేని శ్రీరామచంద్రమూర్తి, జయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త యం.వి. సత్యవతి గారిచే శ్రీకాళహస్తి మాహాత్మ్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యం.వి. సత్యవతి ప్రవచిస్తూ శ్రీకాళహస్తి అనేది కేవలం ఒక దివ్య పుణ్యక్షేత్రం మాత్రమే కాక, నిర్మలమైన శివభక్తికి, నిష్కామ ప్రేమకు ప్రతీకగా నిలిచే అద్భుత ఆధ్యాత్మిక నిలయమన్నారు. స్వర్ణముఖీ నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రంలో శ్రీ అంటే సాలెపురుగు తన నూలు దారాల పందిరితో, కాళము అంటే పాము పాతాళ లోకం నుండి తెచ్చిన రత్నాలతో, హస్తి అంటే ఏనుగు నదీ జలాలు, బిల్వపత్రాలతో పరమశివుడిని ఆరాధించి సాయుజ్య ముక్తిని పొందాయన్నారు. ఈ మూడు జీవుల అనన్య ఆరాధనకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ఆవిర్భవించాడన్నారు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి