ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక - 06.11.2026

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఈశ్వర వరప్రసాద్ పరిషత్ నిర్వహణలో సంస్కృతి వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్ స్మత్యర్ధం శుక్రవారం అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ఇది అతని సంతకం నాటకం సందేశాత్మకంగా సాగింది.   తొలుత సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలచందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాల్ళర్పించారు. కృష్ణమూర్తి అబద్ధం లేని జీవితాన్ని గడిపాడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రయాణించాడు. వేసిన ప్రతి అడుగులోను ప్రత్యేకతను చాటుకొన్నాడు. జీవితపు చరమాంకంలో దంపతులు ఎలా బతకాలో ప్రణాళిక రచించుకొన్నాడు. ఆ ఆలోచనను నిజం చేసుకొన్నాడు. బతికే విధానాన్ని చిత్రించుకొని సంతకం చేసుకొన్నాడు. అందుకే అభినయ ఆర్ట్స్ స్నిగ్ధ రచనకు, యన్. రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఇది అతని సంతకం నాటికను ప్రదర్శించారు. ఇందులో యన్. రవీంద్రరెడ్డి, వి.సిహెచ్.కె. ప్రసాద్, యన్. సూర్య, ట...

ప్రముఖ రంగస్థల నటీమణులకు బొప్పన పురస్కారం - 27.10.2026

ప్రముఖ రంగస్థల నటీమణులకు బొప్పన పురస్కారం

 

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళాపోషకులు బొప్పన నరసింహారావు (బుజ్జి )70వ జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రముఖ రంగస్థల నటీమణులకు బొప్పన ఆత్మీయ పురస్కార ప్రధానం జరిగింది. యువకళావాహిని, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, డాక్టర్ రామరాజు ఫౌండేషన్, నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్, ఎన్టీఆర్ కళాపరిషత్, వై.కె.నాటక పరిషత్, ఉషోదయ కళానికేతన్, కళావిపంచి సంస్థల సంయుక్త నిర్వహణలో  నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువకళావాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. అతిథులుగా న్యాయమూర్తి మైలబత్తుల శోభారాణి, కె.సి.పి. వైస్ ఛైర్మన్ వఝ్ఝ మధుసూధనరావు, డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, కళాపత్రిక సంపాదకుడు డాక్టర్ మహామ్మద్ రఫీ, కధక్ కళాక్షేత్రం అధ్యక్షులు డాక్టర్ కధక్ అంజిబాబు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, శారదా కళాసమితి అధ్యక్షులు డోగిపర్తి శంకరరావు, ఆలయ కమిటి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రముఖ గజల్ కవయిత్రి విజయగోపి, నాట్యాచారిణి తుమ్మూరు వనజా, రంగస్థల నటీమణులు యడవల్లి కనకదుర్గాభవాని, బత్తుల రూపశ్రీ, సురభి పూజిత, రాంపిళ్ల రాజశ్రీ, జయ డిజిటల్స్ ఉండ్రకొండ జయశ్రీ లను బొప్పన ఆత్మీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం అను డాన్స్ అకాడమీ వారు ప్రదర్శించిన శ్రీ అన్నమయ్య నృత్యరూపకం, శ్రీ రమణ కళానిలయం డాక్టర్ చిలువూరి నాగేశ్వరరావు రచనకు పొగర్తి నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన వెన్నెల నాటిక, గాయకుడు ఆలాపన వెంకటేశ్వరరావు ఆలపించిన సినీభక్తిగీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో  జి. మల్లికార్జునరావు, భాగీ శివశంకరశాస్త్రి, ఏం.ఏ. హమీద్, జి.వి.జి.శంకర్, డి.తిరుమలేశ్వరరావు, సయ్యద్ జానీబాషా తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అలరించిన భక్తి సంగీత విభావరి - మహతీ స్వరసుధ - 28.06.2026

అలరించిన భక్తి సంగీత విభావరి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై మహతి స్వరసుధ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో మహతి స్వరసుధ అధ్యక్షురాలు పత్రి నిర్మల, పాడుతా తీయగా-2019 విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లిలను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావును సత్కరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు - 26.06.2026

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు - బృందావన్ గార్డెన్స్, గుంటూరు - 25.07.2026

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది తొలి ఏకాదశి శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారంతో కలిసి రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీనివాసుడ్ని కనులారా వీక్షించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆర్చకులు శ్రీవారిని పలురకాల పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని ముందే ఊహించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు.