ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

అలరించిన తాళం భజన - శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు - 10.10.2026

అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ   పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.

తెలుగు వెలుగుల ఆత్మీయ పురస్కారాలు - 23.08.2026

తెలుగు వెలుగుల ఆత్మీయ పురస్కారాలు  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక పై  ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్బంగా  యువకళావాహిని, కళావిపంచి సంయుక్త నిర్వహణలో తెలుగు వెలుగుల పురస్కార సభాజరిగింది.  సభాధ్యక్షులు గా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ముఖ్య అతిధిగా  ఛైర్మెన్, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ , మన్నవ మోహన కృష్ణ , గౌరవ అతిధిగా ఛైర్మెన్ నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్, గుమ్మడి గోపాలకృష్ణ ,  ఆత్మీయ అతిధులుగా కళ  పత్రిక సంపాదకులు డాక్టర్ మహమ్మద్ రఫీ , కళావిపంచి గౌరవ అధ్యక్షులు, డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు,  వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు,  ఆలయ పాలకమండలి అధ్యక్షులు  సి. హెచ్. మస్తానయ్య , సహా కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు.  అతిధులు ఆంధ్ర కేసరిగా టంగుటూరు ప్రకాశం పంతులు చిరస్మరణీయుడని , అయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం  పలు రంగాలలో నిష్టాతులుగా ఎంపికైన  పురస్కార  గ్రహీతలు...

గౌరీకల్యాణం జగత్కల్యాణం - 19-22.08.2026

గౌరీకల్యాణం జగత్కల్యాణం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం  గౌరీ కల్యాణం పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది.  తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, వుయ్యూరు లక్ష్మీనరసింహరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  తెలుగు లెక్చరర్, పాలకొల్లు చాగంటి సత్యవరాహ నరసింహ లింగరాజు  ప్రవచనం చేస్తూ అమరావతి నిర్మాణకర్త ఐన శ్రీరాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి జీవిత చరిత్రను సంక్షిప్తంగా వివరించి, గౌరీకల్యాణ కథను ప్రారంభించి దక్షయజ్ఞ కథాభాగంతో మొదలు పెట్టి  శ్రీ పార్వతీ పరమేశ్వర కల్యాణ కథామృతాన్ని తన వాక్కుల ద్వారా వివరించి ప్రేక్షక శ్రోతలకు సంతోషం కలిగించారు.

శ్రీకృష్ణ లీలలు పై ఆధ్యాత్మిక ప్రవచనం - 17,18.08.2026

శ్రీకృష్ణ లీలలు పై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం శ్రీకృష్ణ లీలలు పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది.  తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాధ్ ప్రవచనం చేస్తూ భగవంతుని అవతారములన్నింటిలోకి కృష్ణావతారము మహోత్కృష్టమైనది, అత్యంత మాధుర్య భరితమైనదన్నారు. శ్రీకృష్ణుని జననమే అద్భుతమైన లీల అనీ, పుట్టగానే చెప్పండి వచ్చి చంపేస్తాను అన్న పరిస్థితులలో శ్రీకృష్ణుడు జన్మించటం జరిగిందన్నారు.  మృత్యుముఖంలో జన్మించాడనీ, మురళీగానంగా జీవితాన్ని గడిపారన్నారు. శ్రీకృష్ణుని బాల్యలీలలు, భగవంతుని సాన్నిధ్యాన్ని మనకు కలిగించటమే కాక, భగవంతుని తత్త్వాన్ని మనకు తెలియజేస్తాయన్నారు. చిన్నప్పటి నుండే దుష్టశిక్షణ, శిష్ఠ రక్షణ, ధర్మ సంస్థాపన చేసినవారు శ్రీకృష్ణుడని అన్నారు.

నిష్టాతులకు కళాసారధి గుదిబండి వెంకటరెడ్డి జీవన సాఫల్య పురస్కార ప్రధానం - 16.08.2026

నిష్టాతులకు కళాసారధి గుదిబండి వెంకటరెడ్డి జీవన సాఫల్య పురస్కార ప్రధానం  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై  ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, రామరాజు ఫౌండేషన్, గుంటూరు ఎన్. టి. ఆర్. కళాపరిషత్,  సాతులూరు వారి  సంయుక్త నిర్వహణలో  ఆదివారం జి.వి.ఆర్. కల్చరల్ ఫౌండేషన్, హైదరాబాద్ వ్యవస్థాపక ఛైర్మన్, కళాసారధి గుదిబండి వెంకటరెడ్డి జీవన సాఫల్య పురస్కార సభ జరిగింది.  సభాకార్యక్రమానికి సభాధ్యక్షులుగా చెరుకూరి సాంబశివరావు, ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రియల్ఎస్టేటు దామచర్ల శ్రీనివాసరావు, గౌరవ అతిధులుగా ప్రముఖ  చార్టెడ్ అకౌంటెంట్  చిటిపోతు  రామాంజనేయులు, టాక్స్ కన్సల్టెంట్ బొల్లేపల్లి శ్రీనివాసరావు, చార్టెడ్ అకౌంటెంట్ జొన్నలగడ్డ శ్రీనివాస్, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి. హెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు  పాల్గొని జ్యోతి ప్రకాశనంతో సభాకార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్య అతిధి మాట్లాడుతూ గుదిబండి వెంకటరెడ్డి స్మరణిక ఆత్మీయుల జ్ఞాపకాల తోరణం ఏళ్ళ తరబడి అలుపెరగని సాంస్కృతిక యోధుడిగా, పోరాడి దివంగతులైన గుదిబండి ...

ప్రముఖులకు కళాశ్రీ జాతీయ పురస్కారాలు - 15.08.2026

ప్రముఖులకు కళాశ్రీ జాతీయ పురస్కారాలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మకతమరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాంజలి క్రియేషన్స్,శ్రీ.టీ.వీ.సంయుక్త నిర్వహణలో కళాంజలి నాటకోత్సవం,కళాశ్రీ జాతీయ పురస్కారాల సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ  నిర్వాహకులు రంగస్థల,సినీ నటుడు, రచయిత డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. అతిథులుగా రాష్ట్ర బిజెపి ప్రోటోకాల్ ఇన్ చార్జ్  పాతూరి నాగభూషణం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఉత్తర అమెరికా కోమటి జయరామ్, త్రిపురనేని సాహితీ సమితి అధ్యక్షులు  ఆలోకం పెద్దబ్బయ్య, టీవీ నటుడు,నిర్మాత డాక్టర్ అప్పారావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య   తదితరులు పాల్గొని  గుంటుపల్లి సుబ్బారావు (నాటక రంగం), బైరపనేని  పోతరాజు (సాహిత్య, అవధాన రంగం ), డాక్టర్ వి. కమల ( వైద్యరంగం ), ముప్పా  అంకమ్మరావు (సినీ రంగం) లను కళాశ్రీ జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు . సభానంతరం ప్రదర్శించిన సత్య  హరిశ్చంద్ర ప...

ముగిసిన ఉపనిషత్ స్రవంతి కటోపనిషత్ ప్రవచనము - 14.08.2026

ముగిసిన ఉపనిషత్ స్రవంతి కటోపనిషత్  ప్రవచనము అన్నమయ్య కళావేదికపై ఉపనిషత్ స్రవంతిలో భాగంగా కటోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. చిన్మయమిషన్ పూజ్యశ్రీ సువీరానంద స్వామి ప్రవచిస్తూ కేవలం శాస్త్రాలు చదవడం వల్ల గానీ, మేధస్సు వల్ల గానీ ఆత్మజ్ఞానం లభించదు. దుష్ప్రవర్తనను వదిలి, ఇంద్రియ నిగ్రహం పాటించి, ప్రశాంత చిత్తంతో అంతర్ముఖులైన సాధకులకు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కారం లభిస్తుందన్నారు. పరమాత్మ జ్ఞానమే అత్యున్నతమైనదని, ఐహిక సంపదలు పరమార్ధానికి దోహదపడవని చాటిచెప్పడమే ఈ రెండవ వల్లిలోని ప్రధాన సారమన్నారు.

వైభవంగా గోదా అమ్మవారి శ్రీ పుష్పయాగం - 14.08.2026

వైభవంగా గోదా అమ్మవారి శ్రీ పుష్పయాగం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం గోదా అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఉదయం అభిషేకం, సాయంత్రం శ్రీ పుష్పయాగం కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సూరెడ్డి రాంప్రసాద్, శ్రీమతి పద్మజ దంపతులు సౌజన్యం అందించారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యం తులసి ఖాననోద్భవి కార్కాటక మాసంలో వచ్చేటటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్రం రోజున గోదాదేవి జన్మించారు కాబట్టి ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, మహా మంగళహారతి, సాయంత్రం డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి, గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి బృందంచే పారాయణంతో, సుమారు 7 క్వింటాల5 రకాల చామతి, గులాబి, లిల్లీ పూలు, మల్లే, సంపంగి, జాజి, తులసి, సుగంధ ద్రవ్యాలతో ఆలయ పాలకవర్గం సహాయ సహకారాలతో, సూరెడ్డి రాంప్రసాద్, శ్రీమతి పద్మజ దంపతుల సౌజన్యంతో ఆలయ ప్రధాన అర్చకులు మాధవ స్వామి బృందం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ పుష్పయాగం నిర్వహించారు. భక్తులు, స్త్రీలు అధిక సంఖ్యలో పుష్పయాగంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 

కఠోపనిషత్ పై ప్రవచనము - 10-14.08.2026

కఠోపనిషత్ పై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి గారి సౌజన్య సహాకారంతో పూజ్యశ్రీ సువీరానందస్వామి చిన్మయమిషన్ వారిచే ఉపనిషత్ స్రవంతిలోని కఠోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  సువీరానందస్వామి ప్రవచిస్తూ కఠోపనిషత్తు మొదటి అధ్యాయంలోని రెండవ వల్లిలో యమధర్మరాజు నచికేతునికి ఆత్మజ్ఞానం యొక్క రహస్యాలను, జీవన మార్గాలను ఉపదేశిస్తాడన్నారు. రెండవ వల్లిలో యముడు మానవుల ముందుండే రెండు మార్గాలను వివరిస్తాడరన్నారు. మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక మార్గం. వివేకవంతులు దీనిని ఎంచుకుంటారన్నారు. క్షణికమైన ఐహిక సుఖాలను, ఇంద్రియ ప్రీతిని ఇచ్చే మార్గం. అజ్ఞానులు దీని వెంటే పరిగెడతారన్నారు.

చక్కటి హావ భావాలతో కూచిపూడి నృత్యాలు - 09.08.2026

చక్కటి హావ భావాలతో కూచిపూడి నృత్యాలు  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి వారి సౌజన్యంతో  నృత్య కిన్నెర  కార్యదర్శి  మద్దాలి  రఘురాం  నిర్వహణలో  జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల ముగింపుగా ఆదివారం  సౌందర్య మద్దాలి సౌందర్య నృత్య దర్శకత్వంలో నాట్య మయూరి శిష్య బృందం , హైదరాబాద్ వారి ఇల వైకుంఠం కూచిపూడి నృత్య కీర్తనలు ప్రదర్శించి ఆహుతులను అలరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా ఛైర్మెన్ హైపవర్ కమిటీ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ , హైకోర్ట్  జడ్జ్ జస్టిస్ యు. దుర్గాప్రసాద్ రావు, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ , ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి. హెచ్. మస్తానయ్య, సహకార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించారు. సభానంతరం నాట్యాచార్యులు ఎస్. కే. ఖలీల్ రాధామాధవ నాట్యక్షేత్రం శిష్య బృందం , గుంటూరు వారి అచ్యుతం , కేశవం రాధాకృష్ణుల బృంద నాట్యం తో కూచ...