ఆకట్టుకున్న లీలాకృష్ణం కూచిపూడి నృత్యరూపకం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి సౌజన్యంతో శ్రీ నృత్య ఆర్ట్ అకాడమీ, విజయవాడ నాట్యాచార్యులు భాగవతుల వేంకటరామశర్మ 25 మంది శిష్యబృందంచే లీలాకృష్ణం కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకృష్ణ లీలామృతంలోని పూతన భండికాసురుడు, సుడిగాలి రాక్షసుల వధ, గోపికా వస్త్రాపహరణం వంటి అనేక ఘట్టాలను సౌమ్య శ్రీకృష్ణుడుగా, శిష్యులు చక్కటి హావభావాలతో నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు, సంస్థ కన్వీనర్ గుళ్ళపల్లి రాఘవేంద్రరావు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుళ్ళపల్లి సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో కళాకారులను ఘనంగా సత్కరించారు.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి