నటనాలయం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు
నటనాలయం, గుంటూరు ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దినోత్వవ వేడుకలను బుధవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పద్మావతి కళ్యాణ వేదికపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటులు కీ.శే. పూజ్యం నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన ఆత్మీయ పురస్కారాన్ని పొన్పూరు నాటక కళాపరిషత్ అధ్యక్షులు శ్రీ సూరినేని అంజనేయులు నాయుడుకు ప్రదానం చేసి ఘనంగా సత్యరించారు. నటనాలయం, గుంటూరు ఆధ్యక్షులు నీలం మందారావు సభను నిర్వహించగా, డాక్టర్ పట్టాభి కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ తూమలూరి రాజేంద్ర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో శ్రీనివాస్, ఆరాధన ఆర్ట్స్, గుంటూరు అధ్యక్షులు డి. తిరుమలేశ్వరరావు, దేవస్థాన ప్రచాన కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, ప్రముఖ రచయిత, దర్శకులు కళారత్న కావూరి సత్యనారాయణ తదితరులు వేదికను అలంకరించారు. రంగస్థల కళారంగానికి విశేష సేవలందిస్తున్న సూరినేని ఆంజనేయులు నాయుడుకు ఆత్మీయ పురస్కారం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కళాకారులను గౌరవించడం, నాటకరంగ సేవలను గుర్తించడం అభినందనీయమని వక్షలు సభా కార్యక్రమం అనంతరం పేక్ మూస్సేన్ రచించిన 'ఎంతో చిన్నది జీవితం' నాటికను ఎపూరి హరిబాబు దర్శకశ్వంలో ప్రదర్శించారు. జీవితంలోని విలువలు, మానవ సంబంధాలను ప్రతిపింపించే ఈ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు, పురస్కార ప్రదానం, నాటిక్ ప్రదర్శనతో కార్యక్రమం కళాత్మక వాతావరణంలో ఉత్సాహంగా ముగిసింది.


.jpeg)

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి