ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక - 06.11.2026

సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఈశ్వర వరప్రసాద్ పరిషత్ నిర్వహణలో సంస్కృతి వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్ స్మత్యర్ధం శుక్రవారం అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ఇది అతని సంతకం నాటకం సందేశాత్మకంగా సాగింది.   తొలుత సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలచందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాల్ళర్పించారు. కృష్ణమూర్తి అబద్ధం లేని జీవితాన్ని గడిపాడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రయాణించాడు. వేసిన ప్రతి అడుగులోను ప్రత్యేకతను చాటుకొన్నాడు. జీవితపు చరమాంకంలో దంపతులు ఎలా బతకాలో ప్రణాళిక రచించుకొన్నాడు. ఆ ఆలోచనను నిజం చేసుకొన్నాడు. బతికే విధానాన్ని చిత్రించుకొని సంతకం చేసుకొన్నాడు. అందుకే అభినయ ఆర్ట్స్ స్నిగ్ధ రచనకు, యన్. రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఇది అతని సంతకం నాటికను ప్రదర్శించారు. ఇందులో యన్. రవీంద్రరెడ్డి, వి.సిహెచ్.కె. ప్రసాద్, యన్. సూర్య, ట...

ఘనంగా నటరాజ సంగీత నృత్య కళాశాల వార్షికోత్సవం - 05.11.2026

ఘనంగా నటరాజ సంగీత నృత్య కళాశాల వార్షికోత్సవం

నటరాజ సంగీత నృత్య కళాశాల 21వ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు పద్మావతి కళ్యాణవేదికపై నిర్వహించారు. తొలుత ఆలయ అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య, ఆలయ కమిటీ సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, కాజ వెంకట సుబ్రహ్మణ్యం, శనక్కాయల రాధా మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజానన యుతం గణేశ్వరం, రామాయణ శబ్దం, పుష్పాంజలి, చరణములే నమ్మితి, గోవింద నామాలు, జయ జయ దుర్గే, దశావతార శబ్దం, తక్కువేమి మనకు, వినాయకౌత్వం,కృష్ణం కలయసఖి, నాట్య హేల అను కూచిపూడి నృత్యంశాలను చిన్నారులు ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యము ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిధుల చేతుల మీదుగా చిన్నారులకు జ్ఞాపికలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నృత్య దర్శకత్వం వహించిన నాట్యాచారిని ఆనంతుల విజయ కుమారిని అభినందించారు. కార్యక్రమాన్ని అనంతుల ప్రణయనాథ రెడ్డి, విజయ కుమారి పర్యవేక్షించారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అలరించిన భక్తి సంగీత విభావరి - మహతీ స్వరసుధ - 28.06.2026

అలరించిన భక్తి సంగీత విభావరి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై మహతి స్వరసుధ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో మహతి స్వరసుధ అధ్యక్షురాలు పత్రి నిర్మల, పాడుతా తీయగా-2019 విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లిలను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావును సత్కరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు - 26.06.2026

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు - బృందావన్ గార్డెన్స్, గుంటూరు - 25.07.2026

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది తొలి ఏకాదశి శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారంతో కలిసి రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీనివాసుడ్ని కనులారా వీక్షించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆర్చకులు శ్రీవారిని పలురకాల పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని ముందే ఊహించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు.