పాటిబండ్ల సీతారామయ్య స్మారక సేవాసమితి వారి సాంస్కృతిక కార్యక్రమము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారము పాటిబండ్ల సీతారామయ్య స్మారక సేవాసమితి వారి ఆధ్వర్యంలో పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పాటిబండ్ల సీతారా మయ్య 144వ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజి గారు పాల్గొని రాజకీయమంటే అందలం ఎక్కడం కోసం కాదు. సేవా దృక్పథం కలిగి ఉండాలి. నేటి రాజకీ యాల్లో విలువలు పూర్తిగా పోయాయి. ప్రజలు రాజకీయ పార్టీలను మారుస్తున్నారే కానీ.. రాజకీయ నాయకులను మార్చలేకపోతున్నారు. రైతుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు యలమంచిలి శివాజీ అని కొనియాడారు. రైతులను సంఘటితం చేసేందుకు ఎంతో పాటు పడ్డారని, ఆయన కృషి ఫలితంగానే అప్పట్లో క్రాప్ హాలిడే, రైతు రుణమాఫీ వంటివి అమల్లోకి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు కేవలం మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, మానవత్వం, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. విద్య అనేది వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగప డాలని, ప్రశ్నించే తత్వం, న్యాయం పట్ల నిబద్ధత కలిగి ఉండాలని సందేశమి చ్చారు. ఈ కార్యక్రమంలో రావెల సాంబశివరావు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబలను ఘనంగా సత్కరించారు.

.jpeg)

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి