తెలుగు పంచకావ్యాలలో శృంగార నైషధం మొదటిది
శ్రీనాథ మహాకవి రచించిన శృంగార నైషధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో శృంగార నైషధముపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ శ్రీరంగనాయకి ప్రవచిస్తూ శృంగార నైషధం నల, దమయంతిల ప్రేమకథను వర్ణిస్తుందన్నారు. నలరాజు, దమయంతిని వివాహం చేసుకున్న తర్వాత వారు కలిసే కథ ఇదని, ఈ కథను శ్రీహర్షుడు సంస్కృతంలో నైషధ మహాకావ్యంగా రాశాడన్నారు. శ్రీనాథుడు దాన్ని తెలుగులోకి అనువదించాడనీ, శృంగార నైషధం నల, దమయంతిల ప్రేమను, వారి జీవితంలోని వివిధ సంఘటనలను అందంగా వర్ణిస్తుందని, కథలో నలరాజు, దమయంతి నరకయాత్రా కష్టాలను ఎలా ఎదుర్కొన్నారో, వారు ఒకరినొకరు ఎలా మళ్లీ కలుసుకున్నారో వివరిస్తుందని తెలిపారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి