భక్తిశ్రద్ధలతో చండీ హోమం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో ఆదివారం చండీ హోమం నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా విశ్వ శాంతిని కాం క్షిస్తూ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి