అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ఆకట్టుకున్న సంగీత రూపకం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన పార్వతీ కల్యాణం సంగీత రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకులు కంభంపాటి సోదరులు కృష్ణఆదిత్య, కృష్ణశశాంక్‌లు పార్వతీదేవి జననం నుంచి పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చరియల్లో తీవ్రమైన తపస్సు తదితర అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు రూపక గానం చేశారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి