చక్కటి హావ భావాలతో కూచిపూడి నృత్యాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి వారి సౌజన్యంతో నృత్య కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురాం నిర్వహణలో జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల ముగింపుగా ఆదివారం సౌందర్య మద్దాలి సౌందర్య నృత్య దర్శకత్వంలో నాట్య మయూరి శిష్య బృందం , హైదరాబాద్ వారి ఇల వైకుంఠం కూచిపూడి నృత్య కీర్తనలు ప్రదర్శించి ఆహుతులను అలరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఛైర్మెన్ హైపవర్ కమిటీ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ , హైకోర్ట్ జడ్జ్ జస్టిస్ యు. దుర్గాప్రసాద్ రావు, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ , ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి. హెచ్. మస్తానయ్య, సహకార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించారు. సభానంతరం నాట్యాచార్యులు ఎస్. కే. ఖలీల్ రాధామాధవ నాట్యక్షేత్రం శిష్య బృందం , గుంటూరు వారి అచ్యుతం , కేశవం రాధాకృష్ణుల బృంద నాట్యం తో కూచిపూడి నృత్యోత్సవాలు ముగిసాయి. నృత్య కిన్నెర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆర్. ప్రభాకరరావు, నిర్వాహకులు పి. విజయకుమార్, కోశాధికారి కె.వి.సుబ్బారావు తదితరులు అతిధులను, కళాకారులను సత్కరించి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి