ప్రముఖులకు కళాశ్రీ జాతీయ పురస్కారాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మకతమరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాంజలి క్రియేషన్స్,శ్రీ.టీ.వీ.సంయుక్త నిర్వహణలో కళాంజలి నాటకోత్సవం,కళాశ్రీ జాతీయ పురస్కారాల సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ నిర్వాహకులు రంగస్థల,సినీ నటుడు, రచయిత డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. అతిథులుగా రాష్ట్ర బిజెపి ప్రోటోకాల్ ఇన్ చార్జ్ పాతూరి నాగభూషణం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఉత్తర అమెరికా కోమటి జయరామ్, త్రిపురనేని సాహితీ సమితి అధ్యక్షులు ఆలోకం పెద్దబ్బయ్య, టీవీ నటుడు,నిర్మాత డాక్టర్ అప్పారావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య తదితరులు పాల్గొని గుంటుపల్లి సుబ్బారావు (నాటక రంగం), బైరపనేని పోతరాజు (సాహిత్య, అవధాన రంగం ), డాక్టర్ వి. కమల ( వైద్యరంగం ), ముప్పా అంకమ్మరావు (సినీ రంగం) లను కళాశ్రీ జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు . సభానంతరం ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర పద్య నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో హరిశ్చంద్రునిగా డాక్టర్ లక్ష్మీనారాయణ చంద్రమతిగా లక్ష్మీ శ్రీ నక్షత్రులుగా జి వెంకటేశ్వర్లు కాల కౌశికుడు/ వీరబాహునిగా తక్కెళ్ళపాడు మీరావలి లోహితాస్యునిగా బాబు నటించారు. హార్మోనియం పై ఎన్. సిద్దయ్య, డోలక్ పై ఎం. శ్రీనివాసరావు క్లారినెట్ పై రంగ వాయిద్య సహకారం అందించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి