కఠోపనిషత్ పై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి గారి సౌజన్య సహాకారంతో పూజ్యశ్రీ సువీరానందస్వామి చిన్మయమిషన్ వారిచే ఉపనిషత్ స్రవంతిలోని కఠోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువీరానందస్వామి ప్రవచిస్తూ కఠోపనిషత్తు మొదటి అధ్యాయంలోని రెండవ వల్లిలో యమధర్మరాజు నచికేతునికి ఆత్మజ్ఞానం యొక్క రహస్యాలను, జీవన మార్గాలను ఉపదేశిస్తాడన్నారు. రెండవ వల్లిలో యముడు మానవుల ముందుండే రెండు మార్గాలను వివరిస్తాడరన్నారు. మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక మార్గం. వివేకవంతులు దీనిని ఎంచుకుంటారన్నారు. క్షణికమైన ఐహిక సుఖాలను, ఇంద్రియ ప్రీతిని ఇచ్చే మార్గం. అజ్ఞానులు దీని వెంటే పరిగెడతారన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి