తెలుగు వెలుగుల ఆత్మీయ పురస్కారాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక పై ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్బంగా యువకళావాహిని, కళావిపంచి సంయుక్త నిర్వహణలో తెలుగు వెలుగుల పురస్కార సభాజరిగింది. సభాధ్యక్షులు గా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ముఖ్య అతిధిగా ఛైర్మెన్, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ , మన్నవ మోహన కృష్ణ , గౌరవ అతిధిగా ఛైర్మెన్ నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్, గుమ్మడి గోపాలకృష్ణ , ఆత్మీయ అతిధులుగా కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహమ్మద్ రఫీ , కళావిపంచి గౌరవ అధ్యక్షులు, డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి. హెచ్. మస్తానయ్య , సహా కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అతిధులు ఆంధ్ర కేసరిగా టంగుటూరు ప్రకాశం పంతులు చిరస్మరణీయుడని , అయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం పలు రంగాలలో నిష్టాతులుగా ఎంపికైన పురస్కార గ్రహీతలు రచయత, దర్శకులు జరుగుల రామారావు, కథక్ కళాక్షేత్ర అధ్యక్షులు కథక్ అంజిబాబు, ప్రముఖ లలిత సంగీత గాయకులు భాగీ కృష్ణమూర్తి, పౌరాణిక నటులు మువ్వా పెద బాపిరెడ్డి లను తెలుగు వెలుగుల పురస్కారాలతో సత్కరించారు. తొలుత కార్యక్రమాలను డాక్టర్ అంజిబాబు శిష్య బృందం నిర్వహించిన కధక్ నృత్యం ఆకట్టుకుంది తదుపరి మానవత ఎడ్లపాడు వారి కీ .శే . పీ.వీ. భవానీప్రసాద్ రచించి జరుగుల రామారావు దర్శకత్వం వహించిన బావా ఎప్పుడు వచ్చితీవు నాటిక ఆహుతులను అలరించింది. లంకలక్ష్మీనారాయణ, కళావిపంచి అధ్యక్షులు బొప్పన్ననారసింహారావు , డీ.. తిరుమలేశ్వరరావు, భాగి శంకరశాస్త్రి, జీ. మల్లికార్జునరావు, జానీ బాషా తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి