ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం - పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు - 08,09.07.2026

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ  గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.

ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం - 27.10.2025

ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం

స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని, కళావిపంచి సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వ హించారు. అనంతరం జె. రాధాకృష్ణకు కళావిపంచి జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు కళావిపంచి సాహిత్య పురస్కారం, జమలాపురం రాధాకృష్ణ జి.వి.జి.శంకర్, జి.మల్లికార్జునరావులకు బొప్పన ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్ (కాట్రపాడు) ప్రదర్శించిన గారడి నాటిక అలరించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికా ర్జునరావు, బి.జె.పి.అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, డాక్టర్ రవి కొండబోలు, కె.సి.పి. సిమెంట్ వైస్ చైర్మన్ మధుసూదనరావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనా రాయణ, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు.

నాటక కళాకారులకు బొప్పన నరసింహారావు ఒక వరమని కళ పత్రిక సంపాదకుడు మొహమ్మద్ రఫీ అన్నారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోవ్స్లోని శ్రీవేంకటేశ్వ రస్వామి దేవాలయ ఆవరణలోని శ్రీపద్మావతి కళ్యాణ వేదికపై యువ కళావాహిని, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, డాక్టర్ రామరాజు ఫౌండేషన్, ఎన్టీఆర్ కళా పరిషత్, పతులూరు/ గుంటూరు, వై.కే.నాటక పరిషత్, ఉషోదయ కళానికేతన్, కళావిపంచి సంయు క్తంగా సోమవారం బొప్పన నరసింహారావు జన్మదిన వేడుకలు, కళ పత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, కళావిపంచి ఆత్మీయ పురస్కార సభ నిర్వహించారు. డాక్టర్ మొహమ్మద్ రఫీ, నూతలపాటి సాంబయ్య, డొగిపర్తి శంకరరావు, డాక్టర్ వంశీరామరాజు, నాయుడుగోపీ తదితరులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. యువకళావాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీ నారాయణ సభాధ్యక్షత వహించారు.












కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.