అలరించిన సినీ సంగీత విభావరి - 26.10.2025
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతీ స్వరసుధ ప్రత్యేక సినీ సంగీత విభావరి నిర్వహించారు. మహతీ స్వరసుధ వ్యవస్థాపకురాలు పత్రి నిర్మల ఆధ్వర్యంలో గుళ్లపల్లి సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేం ద్రరావు, ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఆతుకూరి సుబ్బారావు, విశ్రాంత ఈఈ చందు వేంకటాద్రి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య జ్యోతిప్రజ్వ లనతో ప్రారంభించారు. గాయని గాయకులు కె.రసూల్ బాబు, సురభి శ్రావణి, ఎస్. కమల్ కిశోర్, జి.హారిక, పత్రి నిర్మల, సి.హెచ్. రాజ్యలక్ష్మి, బి. కృష్ణప్రసాద్, మధులత, ప్రహర్షిత సినీ గీతాలను ఆలపించారు. కీబోర్డుపై కె.రవిబాబు, తబలాపై ఎస్.వెంకట్, ప్యాడ్స్పై టి.ఈశ్వర్ వాయిద్యాన్ని అందించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యతగా వ్యవహరించగా, కార్యదర్శి మద న్మోహనరావు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి