హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ
ప్రజల వైద్యుడు డాక్టర్
ముద్దన హనుమంతరావు జీవిత సంగ్రహంపై డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు వ్రాసిన
గ్రంథా విష్కరణ సభ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర
స్వామి వారి దేవస్థానం శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై జరుపుతున్నట్లు భారతి ధార్మిక
విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ
వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రికను
ఆవిష్కరించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ సభకు రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్
యలమంచిలి శివాజీ అధ్యక్షత వహిస్తారని, జ్యోతి ప్రకాశనం దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు
మస్తానయ్య చేస్తారని, విశిష్ట అతిథి పూర్వ పార్లమెంటు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, శాసనమండలి పూర్వ సభ్యులు
కే ఎస్ లక్ష్మణరావు గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఆత్మీయ అతిథులుగా డాక్టర్ సీతారామయ్య
పారిశ్రామికవేత్త పోలిశెట్టి జ్ఞానదేవ్, సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షులు వనమా
పూర్ణచంద్రరావు, ఏపీ కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్రపాటి రామారావు పాల్గొంటారు. డాక్టర్ ముద్దన హనుమంతరావు అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ
కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బొల్లెపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో
తెలియజేశారు. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణలో బొల్లెపల్లి సత్యనారాయణ, చిటిపోతు మస్తానయ్య, డాక్టర్ వెన్ని శెట్టి
సింగారావు, ఏలూరి సూర్యనారాయణ, ఇరుగులపాటి వేణుగోపాలరావులు పాల్గొన్నారు.
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)



.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి