వైభవంగా శ్రీవారి కళ్యాణం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. మూలవిరాట్‌కు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. వేదపండితుల ఆధ్వర్యంలో దంపతులచే ఉభయదేవేరి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
అలరించిన భక్తిసంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం కళాంజలి, గుంటూరు వారిచే భక్తిసంగీత విభావరి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ గాయకులు షేక్ రసూల్‌బాబు, పత్రి గాయత్రి, శ్రీపత్రి లలిత్‌బాబు, ఆర్. సాంబశివరావు లు తమ గాత్రధారణలో పలు భక్తి గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆలరింపజేశారు. కీబోర్డుపై కె. రవిబాబు, తబలాపై వెంకట చక్కటి వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమాలను తొట్టెంపూడి రమేష్ పర్యవేక్షించారు.

.jpeg)
.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి