వీనుల విందుగా మహతీ స్వరసుధ భక్తి సినీ సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతీ స్వరసుధ వ్యవస్థాపకులు పత్రినిర్మల ఆధ్వర్యంలో సంస్థ రజతోత్సవాలలో ఆరవ కార్యక్రమంలో గాయని గాయకులు రాజ్యలక్ష్మి, హేమమాలిని , రమణి, ముకుంద ప్రియా, మనస్విని, ప్రద్యుమ్న, హరికృష్ణ, వలి, వీర రాఘవ, కృష్ణ ప్రసాద్ లు అలనాటి ఆణి ముత్యాలను వీనుల విందుగా గానం చేసి అహుతులను అలరించారు. వీరికి కీబోర్డ్ పై కే. రవిబాబు, తబలా ఎస్. వెంకట్, పాడ్స్ టీ. ఈశ్వర్, వాయిద్య సహకారాన్ని అందించారు. గౌరవ అతిధులుగా చిలకలూరిపేట తాటికోల అనిరుద్, శ్రీమతి రమాదేవి, ఛైర్మెన్ శ్రీమతి ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆతుకూరి సుబ్బారావు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి