కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
మూత్ర సమస్యలపై అవగాహన అవసరం
మూత్ర సంబంధిత సమస్యలపై వయోవృద్ధులు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ ఆరె అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగ ణంలోని అన్నమయ్య కళావేదికపై గుంటూరు జిల్లా సీని యర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూత్ర సమస్య లపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కార్తీక్ ఆరె, డాక్టర్ చేకూరి సింధుశ్రీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూత్ర సమస్యలపై అవగాహన కల్పించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి