ఘనంగా కళాసేవా పురస్కారం ప్రదానం
స్థానిక బృందావన్గార్డెన్స్, శ్రీఅన్నమయ్య కళావేదికపై గురువారం బీవీ రావు మెమోరియల్ థియేటర్స్ వారి ఆధ్వర్యంలో కళా సేవా పురస్కార సభ ఘనంగా జరి గింది. సభాధ్యక్షుడుగా నటుడు, దర్శకుడు ఏంవీ ఎల్ నరసింహారావు వ్యవహరించగా ప్రముఖ వ్యాఖ్యాత ఏవీకే సుజాత సభా పరిచయం చేశారు. ముఖ్య అతి ధిగా డాక్టర్ ఆరె, అతిధులుగా ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, జైభవాని నాట్య మండలి అధ్యక్షుడు ఐతి వాసుదేవశర్మ, బి.శ్రీనివాస్, పురస్కార ప్రదాత వీఎస్ రోహిత్ పాల్గొని నటుడు, గుణ నిర్ణేత పరిషత్ నిర్వాహకులు మానాపురం సత్య నారాయణను కళాసేవా పురస్కారంతో ఘనంగా సత్క రించారు. సభానంతరం నంది అవార్డు గ్రహీత కావూరి సత్యనారాయణ పర్యవేక్షణలో కె.ఆదిత్య రచించి, కేవీ మంగారావు దర్శకత్వం వహించిన మిణుగురు - వెలు గులు నాటిక ఆకట్టుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి