శ్రీవారిని దర్శించుకున్న హంపి విరుపాక్ష పీఠాధిపతి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని గురువారం హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్యభారతిమహాస్వామి స్వామి దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు, ఆలయ కమిటి సభ్యులను ఆశీర్వదించారు. తొలుత ఆలయ మర్యాదలతో విద్యారణ్యభారతిస్వామికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి