మంత్రాలలో మొదటిది ఓంకారం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ప్రవచన కర్త కేవీ కోటేశ్వరరావుచే జగద్గురు శంకరాచార్య విరచిత గణేశా పంచరత్నంపై ప్రవచనం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.. కేవీ కోటేశ్వరరావు ప్రవచిస్తూ మంత్రాలలో మొదటిది ఓంకారమని, పూజలలో మొదటి వాడు గణపతి అని అన్నారు. ఏ పూజలైనా మొదట గణపతి పూజతో ప్రారంభించాలనేది బ్రహ్మోపదేశ మని, ముందుగా గణపతిని పూజిస్తే మనకేం కావాలో ఆయనే చూసు కుంటాడని అన్నారు. మనిషికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి మనసును జ్ఞాన పూరితంగా ఉంచేవాడు గణపతి, సకల దేవతాస్వరూపుడు గణపతి అని తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి