అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
యోగాసన ప్రదర్శన, భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారము ప్రపంచ యోగా దినోత్సవము, ప్రపంచ సంగీత దినోత్సవము సందర్భంగా యోగాచార్య డాక్టర్ రెడ్డి సాంబశివరావు గారి శిష్యబృందంచే యోగాసన ప్రదర్శనలు, పరమేశ్వరి పాటల పల్లకి వారి ఆధ్వర్యములో శ్రీమతి యన్. పరమేశ్వరి బృందంచే భక్తిగీతాలాపన కార్యక్రమం జరిగింది.


.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి